అడవిదేవులపల్లి : బాల్నేపల్లిలో ఆస్తి కోసం హత్య

అడవిదేవులపల్లి : బాల్నేపల్లిలో ఆస్తి కోసం హత్య

అడవిదేవులపల్లి, మన సాక్షి:

నల్గొండ జిల్లా అడవిదేవులపల్లి మండలం బాల్నేపల్లి గ్రామంలో ఆస్తి కోసం హత్య చేసిన ఘటన సోమవారం సాయంత్రం 6 గంటలకు చోటుచేసుకుంది.మిర్యాలగూడ డి.ఎస్.పి వెంకటగిరి తెలిపిన వివరాల ప్రకారం బాల్నేపల్లి గ్రామానికి చెందిన జడ కాటమయ్యకు భార్య కుమారుడు ఉన్నారు.భార్య గత కొంత కాలం క్రితం వదిలి వెళ్ళిపోగా కాటమయ్యకు పక్షవాతం వ్యాధి వచ్చింది.

 

కుమారుడు తనను పట్టించుకోకపోవడంతో తన బాబోగులు చూసుకోకపోవడంతో అదే గ్రామానికి చెందిన తన తమ్ముడి కుమారుడు జడ కోటేశ్వరరావును ఆశ్రయించాడు.తనకు ఎకరం 10 గుంటల భూమి ఉందని తనను మంచిగా చూసుకోవాలని కోరగా జడ కోటేశ్వరరావు దానికి సానుకూలంగా స్పందించాడు.

 

కొన్ని రోజుల తర్వాత జడ కాటమయ్య కోటేశ్వరరావును తన భూమిని 20 గుంటలు కొనుగోలు చేయమని అడగగా కోటేశ్వరరావు 20 గుంటల భూమిని జడ కాటమయ్య వద్ద కొనుగోలు చేసినాడు.ఆ డబ్బుతో కొన్ని రోజులు జీవనం సాగించాడు మరలా కోటేశ్వరరావును పిలిపించి తన వద్ద ఉన్న 30 గుంటల భూమిని నీ పేరు మీద రిజిస్ట్రేషన్ చేస్తాను.

 

నా మంచి చెడులు చూసుకోవాలని కోరగా కోటేశ్వరరావు దానికి సరే అని చెప్పి నాలుగు నెలల క్రితం కాటమయ్య తన 30 గుంటల భూమిని తన తమ్ముడు కుమారుడైన కోటేశ్వరరావు పేరు మీద రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది.తన తండ్రి ఆస్తి తనకు ఇవ్వలేదని నా తండ్రి ఆస్తి నాకు ఇవ్వకుండా చేశాడని,ఆస్తి మొత్తం కోటేశ్వరరావు పేరు మీద చేయించుకున్నాడని కోటేశ్వరరావు పై జడ కాటమయ్య కుమారుడు జడ కాశయ్య కక్ష పెంచుకున్నాడు .

 

ALSO READ : 

  1. Runa Mafi : రుణమాఫీ ఎవరికి వర్తిస్తుంది..? తెలుసుకుందాం..!
  2. WhatsApp : వాట్సాప్ లో కీలక మార్పు.. యూజర్స్ అంతా తెలుసుకోవాల్సిందే..!
  3. Gruhalakshmi : గృహ లక్ష్మీ పథకానికి దరఖాస్తుల ఆహ్వానం..!

 

గత కొన్ని రోజుల క్రితం ఇదే వ్యవహారంపై కోటేశ్వరరావును చేయి విరగొట్టగా జడ కాశయ్య జైలుకు వెళ్లి వచ్చినట్లు తెలిపారు. అప్పటినుండి కోటేశ్వరరావు పై పగబట్టి సోమవారం సాయంత్రం 6 గంటల ప్రాంతంలో తన పెదనాన్న అయినటువంటి జడ కాటమయ్యకు స్నానం చేయిద్దామని వెళ్లిన కోటేశ్వరరావు పై గొడ్డలితో దాడి చేసి మెడపై నరికి హత్య చేయడం జరిగింది.

 

కోటేశ్వరరావు హత్యకు కాశయ్యకు సహకరించినటువంటి మరో ఇద్దరు అదే గ్రామానికి చెందిన జడ నరసింహారావు,జడ శ్రీనివాస్ సహకరించినట్లు మృతుని తమ్ముడు జడ రాంబాబు తెలిపినట్లు డి.ఎస్.పి వెంకటగిరికి తెలిపారు.మృతునికి భార్య,ఇద్దరు కుమారులు,ఒక కూతురు ఉన్నట్లు తెలపడం జరిగింది.డి.ఎస్.పి వెంకటగిరి వెంట మిర్యాలగూడ రూరల్ సిఐ సత్యనారాయణ,
అడవిదేవులపల్లి ఎస్సై హరిబాబు,పోలీస్ సిబ్బంది ఉన్నారు.