మూడేళ్ల కుమారుడు కు విషం ఇచ్చి.. ఆత్మహత్యాయత్నం కు పాల్పడ్డ తల్లి..!

మూడేళ్ల కుమారుడు కు విషం ఇచ్చి.. ఆత్మహత్యాయత్నం కు పాల్పడ్డ తల్లి..!

నేలకొండపల్లి ,  మన సాక్షి :

ఆ తల్లికి ఏం కష్టం వచ్చిందో ఏమో కానీ…. అల్లారు ముద్దుగా పెంచుకున్న తన కుమారుడు మూడేళ్ల చిన్నారికి విషం ఇచ్చి….. తాను విషం తాగి ఆత్మహత్యాయత్నం కు పాల్పడ్డ ఘటన జిల్లాలో చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి..

 

ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలంలోని బోదుల బండ గ్రామానికి చెందిన కట్టెకుల శ్రావణి భర్త హరీష్ లు నేలకొండపల్లి మండల కేంద్రంలో నివాసం ఉంటున్నారు. కాగా గురువారం ఇంట్లో ఎవరు లేని సమయంలో శ్రావణి కి ఏ ఇబ్బంది కలిగిందో తెలియదు… ఆత్మహత్య చేసుకుందామని భావించింది.

 

ALSO READ : 

  1. WhatsApp : వాట్సాప్ లో కీలక మార్పు.. యూజర్స్ అంతా తెలుసుకోవాల్సిందే..!
  2. Srisailam : శ్రీశైలం జలాశయానికి పెరిగిన వరద.. విద్యుత్ ఉత్పత్తితో దిగువకు నీరు..!
  3. వామ్మో మామూలు భార్య కాదు ఆమె : భర్త నల్లగా ఉన్నాడని వేధింపులు.. కోర్టు ఏం చెప్పిందంటే..!
  4. WhatsApp : వాట్సాప్ లో కీలక మార్పు.. యూజర్స్ అంతా తెలుసుకోవాల్సిందే..!

 

వెంటనే ఇంట్లో నున్న బొద్దింకల మందు తాగి ఆత్మహత్య చేసుకుందామని భావించి వెంటనే ఇంట్లో ఉన్న బొద్దింకల మందు తాగి ఆత్మహత్యకు ఎత్నించింది . కానీ కళ్ళెదుట ఏ పాపం తెలియని తన మూడేళ్ల కుమారుడు ( షణ్ముఖ ) రోదిస్తూ కనిపించాడు. ఆ తల్లి బరువెక్కిన హృదయంతో తనతో పాటు తన బిడ్డను కూడా చంపేందుకు సిద్ధపడింది .

 

అంతే వెంటనే ఆమె బొద్దింకల మందు తాగి ఆత్మహత్యాయత్నం కు పాల్పడుతూ… మూడేళ్ల బాబుకు కూడా తాపించింది. ఇరువురు అపస్మారక స్థితిలో ఉన్న తల్లి, కుమారుడును చుట్టుపక్కల వారు గమనించి నేలకొండపల్లి ప్రభుత్వ హాస్పిటల్ కు తరలించారు . డాక్టర్ ఆర్ శ్రావణ్ కుమార్ ప్రథమ చికిత్స చేశారు. మెరుగైన వైద్యం కోసం ముదిగొండ 108 వాహనం ద్వారా ఖమ్మం కు తరలించారు.

 

ప్రస్తుతం తల్లి కుమారుడు ఖమ్మం ప్రభుత్వ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు. వీరిలో మూడేళ్ల చిన్నారి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది. కాగా ఆత్మహత్యాయత్నం కు గల కారణాలు తెలియాల్సి ఉంది.