Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణవైద్యంహైదరాబాద్

Hyderabad : మలక్ పేట మెట్రో అగ్ని ప్రమాద నిందితుడి అరెస్టు..!

Hyderabad : మలక్ పేట మెట్రో అగ్ని ప్రమాద నిందితుడి అరెస్టు..!

మన సాక్షి, హైదరాబాద్ :

హైదరాబాదులోని మలక్ పేట మెట్రో స్టేషన్ వద్ద జరిగిన అగ్ని ప్రమాద సంఘటన సంచలనం కలిగించింది. మలక్ పేట మెట్రో స్టేషన్ వద్ద ద్విచక్ర వాహనాలు దగ్ధం జరిగిన సంఘటన రెండు రోజుల క్రితం చోటుచేసుకుంది. సీసీ పూటేజీ ఆధారంగా పోలీసులు విచారణ చేశారు. అయితే ఈ కుట్ర వెనుక ఉగ్రవాదుల హస్తం ఉందేమో అనుమానంతో పోలీసులు విచారణ జరిపారు.

సిసి పూటేజీ ద్వారా నిందితుడిని గుర్తించారు. ప్రమాదానికి కారణమైన ప్రధాన నిందితుడు జాకీర్ అలియాస్ బాంటాను పోలీసులు అదుపులోకి విచారణ చేపడుతున్నట్లు సమాచారం. నిందితుడు గతంలో కూడా ఇలాంటి సంఘటనలకు పాల్పడ్డట్లు తెలుస్తోంది.

MOST READ : 

మరిన్ని వార్తలు