Malkajgiri : అనుమతులకు విరుద్ధంగా నిర్మాణాలు.. కూల్చివేసిన అధికారులు..!
Malkajgiri : అనుమతులకు విరుద్ధంగా నిర్మాణాలు.. కూల్చివేసిన అధికారులు..!
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా , మనసాక్షి :
అనుమతులకు విరుద్ధంగా నిర్మిస్తున్న వ్యాపార సముదాయాన్ని అడ్డుకొని మల్కాజిగిరి టౌన్ ప్లానింగ్ అధికారులు కూల్చివేశారు. మల్కాజిగిరి సర్కిల్ గౌతమ్ నగర్ డివిజన్ పరిధిలోని హనుమాన్ పేట్ మెయిన్ రోడ్ లో అనుమతులకు విరుద్ధంగా నిర్మిస్తున్న వ్యాపార సముదాయాన్ని టౌన్ ప్లానింగ్ అధికారులు అడ్డుకొని కూల్చివేశారు.
టౌన్ ప్లానింగ్ అధికారి తుల్జాసింగ్ మాట్లాడుతూ గౌతమ్ నగర్ డివిజన్ పరిధిలోని హనుమాన్ పేట్ మెయిన్ రోడ్ లో ఒక వ్యాపారి అక్రమంగా వ్యాపార సముదాయాన్ని నిర్మిస్తున్నాడని స్థానిక నుండి ఫిర్యాదు అందడంతో మున్సిపల్ కమిషనర్ రాజు ఆదేశానుసారం అక్కడికి వెళ్లి పరిశీలించగా స్టిల్ ప్లస్ టు తో పర్మిషన్ తీసుకొని షెటర్ అనధికారికంగా నిర్మించడంతో గురువారం మా యొక్క సిబ్బందితో వెళ్లి అక్రమ నిర్మాణ సముదాయాన్ని కూల్చివేసామని అన్నారు.
సర్కిల్ పరిధిలో పర్మిషన్ లేకుండా అలాగే పరిమిషలు తీసుకొని వాటికి విరుద్ధంగా నిర్మించే ఏ సముదాయన్నైనా కూల్చివేసి వారిపై తగు చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వారి వారి కాలనీలలో అక్రమ నిర్మాణాలు ఏవైనా ఉంటే నిస్సంకోచంగా మాకు తెలియజేయాలని కోరారు.
సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని అన్నారు. ఈ కార్యక్రమంలో టౌన్ ప్లానింగ్ చైన్ మెన్ నాగరాజు, సిబ్బంది పాల్గొన్నారు.
LATEST UPDATE :
Jagityal : ఆంక్షలు లేకుండా రైతు రుణ మాఫీ చేయాలి.. బీఆర్ఎస్ భారీ ధర్నా..!









