Breaking NewsTOP STORIESజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ

మనసాక్షి నూతన సంవత్సర 2024 క్యాలెండర్ ఆవిష్కరించిన ఎమ్మెల్యే బిఎల్ఆర్

మనసాక్షి నూతన సంవత్సర 2024 క్యాలెండర్ ఆవిష్కరించిన ఎమ్మెల్యే బిఎల్ఆర్

మిర్యాలగూడ, మనసాక్షి

నూతన సంవత్సర 2024 మనసాక్షి క్యాలెండర్ ను శనివారం మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి ఆవిష్కరించారు. స్థానిక క్యాంపు కార్యాలయంలో పత్రిక చీఫ్ ఎడిటర్ మల్లె నాగిరెడ్డి, పలువురు నాయకులతో కలిసి క్యాలెండర్ ను ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మనసాక్షి దిన పత్రిక అతి తక్కువ సమయంలో అందరి ఆధరాభిమానాలు పొందిందన్నారు. రాబోయే రోజుల్లో మరింత అభ్యున్నతి చెందాలని ఆయన కోరారు. వాస్తవాలు రాసే పత్రికగా మనసాక్షికి గుర్తింపు లభించిందన్నారు. మనసాక్షి పత్రిక క్యాలెండర్ ప్రతి ఒక్కరికి ఉపయోగపడే విధంగా వాస్తు ప్రకారం ఉందని ఆయన పేర్కొన్నారు.

ALSO READ : అంగరంగ వైభవంగా క్యాంప్ ఆఫీస్ లోకి ఎమ్మెల్యే బిఎల్ఆర్

కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు గాయం ఉపేందర్ రెడ్డి, నూకల వేణుగోపాల్ రెడ్డి, బెజ్జం సాయి, సైదులు మనసాక్షి విలేకరులు బొంగర్ల సైదులు, శీలం వినయ్ గౌడ్, సత్యనారాయణ చారి, సైదులు తదితరులు పాల్గొన్నారు.

ALSO READ : BREAKING : కెసిఆర్ ను కలిసిన ఏపీ సీఎం వైఎస్ జగన్.. రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం..!

మరిన్ని వార్తలు