Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking NewsTOP STORIESఆంధ్రప్రదేశ్జిల్లా వార్తలుతెలంగాణహైదరాబాద్

BREAKING : కెసిఆర్ ను కలిసిన ఏపీ సీఎం వైఎస్ జగన్.. రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం..!

BREAKING : కెసిఆర్ ను కలిసిన ఏపీ సీఎం వైఎస్ జగన్.. రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం..!

హైదరాబాద్, మన సాక్షి :

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి , బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర రావుని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి గురువారం కలిశారు. హైదరాబాదులోని ఆయన నివాసంలో వైయస్ జగన్ కలిసి కేసీఆర్ ను పరామర్శించారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కాలు జారిపడి చికిత్స అనంతరం తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్న విషయం తెలిసిందే.

ALSO READ : కాంగ్రెస్ లో చేరిన షర్మిల.. వైఎస్ఆర్ టిపి విలీనం..!

వైయస్ జగన్ ఆయనను కలిసి పరామర్శించారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఏపీ సీఎం జగన్ కలవడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పవచ్చును. ఇటీవల జరిగిన తెలంగాణ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి పాలు కావడం, మరో నాలుగు మాసాల్లో ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు ఉండడం… వీరిద్దరూ కలవడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పవచ్చును.

ఇటీవల తెలంగాణ సీఎం గా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం ఆయనను జగన్ కలవలేదు.  జగన్ హైదరాబాదులోని కేసీఆర్ ను కలవడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. ఆంధ్రప్రదేశ్ లో రాబోయే ఎన్నికల్లో తెలంగాణ ఎన్నికల ప్రభావం ఉంటుందని ఊహాగానాలు వస్తున్న విషయం తెలిసిందే.

రాజకీయ పరిశీలకులు సైతం తెలంగాణ ఎన్నికల ప్రభావం ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఉంటుందని పేర్కొంటున్నారు. కాగా ప్రస్తుతం వీరిద్దరి కలయిక రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

ALSO READ : వీఆర్ఏలకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్..!

మరిన్ని వార్తలు