వీఆర్ఏలకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్..!

తెలంగాణలో వీఆర్ఏలకు కాంగ్రెస్ ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలియజేసింది. పెండింగ్ లో ఉన్న వీఆర్ఏల జీతాలకు క్లియరెన్స్ లభించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో కాలంగా వేతనాలు లేక ఎదురుచూస్తున్న వీఆర్ఏలకు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలియజేస్తూ వారి జీతాలకు క్లియరెన్స్ చేసింది.

వీఆర్ఏలకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్..!

హైదరాబాద్ , మన సాక్షి :

తెలంగాణలో వీఆర్ఏలకు కాంగ్రెస్ ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలియజేసింది. పెండింగ్ లో ఉన్న వీఆర్ఏల జీతాలకు క్లియరెన్స్ లభించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో కాలంగా వేతనాలు లేక ఎదురుచూస్తున్న వీఆర్ఏలకు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలియజేస్తూ వారి జీతాలకు క్లియరెన్స్ చేసింది.

వివిధ శాఖలలో విలీనమై నా 15,560 మంది రెవిన్యూ శాఖలో సూపర్ న్యూమరి పోస్టుల ద్వారా పనిచేస్తున్న వారందరికీ పెండింగ్ లోని ఏడు నెలల వేతనాలను ఇవ్వాలని ఆయా జిల్లా కలెక్టర్లకు సిసిఎల్ఏ ఆదేశించింది.

వేతనాలు ఇవ్వాలని బుధవారం మేము జారీ చేశారు. జీవో నెంబర్ 81, 85 ల ద్వారా వివిధ శాఖల్లో గ్రేడ్ సర్వీసెస్, రికార్డ్ అసిస్టెంట్స్, జూనియర్ అసిస్టెంట్లుగా పనిచేస్తున్నారు. వారందరికీ రెగ్యులర్ పే స్కేల్ ని అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. కొన్ని నెలలుగా వేతనాలు లేక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న వీఆర్ఏలకు ప్రభుత్వ నిర్ణయం వారికి ఉపశమనం కలిగించింది.

ALSO READ : BREAKING : గృహలక్ష్మి పథకాన్ని రద్దు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం..!