Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking NewsTOP STORIESతెలంగాణహైదరాబాద్

BREAKING : గృహలక్ష్మి పథకాన్ని రద్దు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం..!

BREAKING : గృహలక్ష్మి పథకాన్ని రద్దు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం..!

హైదరాబాద్, మన సాక్షి :

తెలంగాణ ప్రభుత్వం గృహలక్ష్మి పథకాన్ని రద్దు చేసింది. గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ పథకాన్ని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే రద్దు చేస్తూ జీవో జారీ చేసింది. గృహలక్ష్మి పథకం స్థానంలో అభయహస్తం పేరుతో ఐదు లక్షల రూపాయల ఆర్థిక సహాయం ఇవ్వనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.

కొత్త పథకం నేపథ్యంలో గృహలక్ష్మి పథకాన్ని రద్దు చేస్తున్నట్లు జీవోలో పేర్కొన్నది. లబ్ధిదారులకు జిల్లా కలెక్టర్లు ఇచ్చిన మంజూరు పాత్రాలను సైతం రద్దు చేశారు.

ఇంటి స్థలం ఉన్న పేదలకు గృహ నిర్మాణం కోసం మూడు లక్షల రూపాయల ఆర్థిక సహాయం చేసేందుకు గత ప్రభుత్వం గృహలక్ష్మి పేరుతో ఈ పథకాన్ని ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. కాగా కాంగ్రెస్ ప్రభుత్వం ఆ పథకాన్ని రద్దుచేసి అభయహాస్తం పేరుతో 5 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందించనున్నది.

ALSO READ : Free Bus : ఉచిత బస్సులో ప్రయాణించే మహిళలకు.. షాకింగ్ న్యూస్..!

మరిన్ని వార్తలు