కాంగ్రెస్ లో చేరిన షర్మిల.. వైఎస్ఆర్ టిపి విలీనం..!

వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైయస్ షర్మిల గురువారం కాంగ్రెస్ పార్టీలో చేరారు.

కాంగ్రెస్ లో చేరిన షర్మిల.. వైఎస్ఆర్ టిపి విలీనం..!

న్యూఢిల్లీ , మన సాక్షి :

వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైయస్ షర్మిల గురువారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. న్యూఢిల్లీలోని ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే , సీనియర్ కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీ సమక్షంలో ఆమె కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. షర్మిల ఆంధ్ర ప్రదేశ్ పిసిసి అధ్యక్షుల పదవిని ఆశిస్తున్నట్లు సమాచారం.

ALSO READ : వీఆర్ఏలకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్..!

ఆంధ్రప్రదేశ్ లో మరో నాలుగు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరిక చర్చనీయాంశంగా మారింది. షర్మిల రాబోయే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కీలక పాత్ర పోషించే అవకాశాలు ఉన్నాయి.

అనంతరం వైయస్ షర్మిల మాట్లాడుతూ ఈరోజు వైఎస్ఆర్టీపీ ను కాంగ్రెస్ లో విలీనం చేశాను, వైఎస్ రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ పార్టీలో గొప్ప నేత, ఆయన ఎప్పుడూ కాంగ్రెస్ పార్టీ కోసం అహర్నిశలూ శ్రమించి అన్నారు. కాంగ్రెస్ పార్టీ దేశంలోనే అతిపెద్ద సెక్యులర్ పార్టీ, అన్ని వర్గాలను కలుపుకుంటూ, అందరినీ కలుపుతూ పని చేస్తుందని అన్నారు.

ఒక క్రిస్టియన్ గా మణిపూర్ లో చర్చిల కూల్చివేత నన్ను తీవ్రంగా బాధించిందని, సెక్యులర్ పార్టీ అధికారంలో లేకపోతే ఏం జరుగుతుంది అనడానికి ఇదొక నిదర్శనం అన్నారు.

భారత్ జోడో యాత్ర రాహుల్ గాంధీ పై నమ్మకాన్ని నాతో పాటు ప్రజలందరిలో పెంచిందని, కేసీఆర్ వ్యతిరేక ఓటు చీలకూడదు అన్న ఉద్దేశంతో కాంగ్రెస్ కి మద్దతు ప్రకటించి పోటీ చేయలేదన్నారు. రాహుల్ గాంధీ నీ ప్రధానిగా చూడాలన్నది నా తండ్రి అశయం అన్నారు.

ALSO READ : BREAKING : గృహలక్ష్మి పథకాన్ని రద్దు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం..!