అంగరంగ వైభవంగా క్యాంప్ ఆఫీస్ లోకి ఎమ్మెల్యే బిఎల్ఆర్

మిర్యాలగూడ శాసనసభ్యులు భత్తుల లక్ష్మారెడ్డి (బిఎల్ఆర్) శనివారం అంగరంగ వైభవంగా క్యాంపు ఆఫీసులోకి వెళ్లారు. నియోజకవర్గ వ్యాప్తంగా కార్యకర్తలు ఉత్సాహంగా భారీగా తరలివచ్చారు. స్వాగత తోరణాలతో బిఎల్ఆర్ కు కార్యకర్తలు జేజేలు పలికారు. ఉదయం 10 గంటలకు తన నివాసం నుంచి బయలుదేరిన శాసనసభ్యులు బిఎల్ఆర్ నేరుగా తెలంగాణ అమరవీరుల స్థూపం వద్దకు చేరుకొని అమరవీరులకు నివాళులర్పించారు.

అంగరంగ వైభవంగా క్యాంప్ ఆఫీస్ లోకి ఎమ్మెల్యే బిఎల్ఆర్

నియోజకవర్గ వ్యాప్తంగా తరలివచ్చిన నాయకులు,  కార్యకర్తలు

మిర్యాలగూడ , మన సాక్షి :

మిర్యాలగూడ శాసనసభ్యులు భత్తుల లక్ష్మారెడ్డి (బిఎల్ఆర్) శనివారం అంగరంగ వైభవంగా క్యాంపు ఆఫీసులోకి వెళ్లారు. నియోజకవర్గ వ్యాప్తంగా కార్యకర్తలు ఉత్సాహంగా భారీగా తరలివచ్చారు. స్వాగత తోరణాలతో బిఎల్ఆర్ కు కార్యకర్తలు జేజేలు పలికారు. ఉదయం 10 గంటలకు తన నివాసం నుంచి బయలుదేరిన శాసనసభ్యులు బిఎల్ఆర్ నేరుగా తెలంగాణ అమరవీరుల స్థూపం వద్దకు చేరుకొని అమరవీరులకు నివాళులర్పించారు.

అనంతరం క్యాంప్ ఆఫీస్ లో వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య పూజలు నిర్వహించారు. అనంతరం అన్ని మతాలవారు సర్వమత ప్రార్థనలు చేశారు. నియోజకవర్గ వ్యాప్తంగా తరలివచ్చిన కార్యకర్తలను ప్రతి ఒక్కరిని కలిశారు.

తనకు విజయాన్ని అందించిన ప్రతి కార్యకర్తకు అభివాదం తెలిపారు. రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటానని బిఎల్ఆర్ పేర్కొన్నారు. డిఎస్పి వెంకటగిరి, ఆర్డిఓ చెన్నయ్య లు బి ఎల్ ఆర్ కు పుష్పగుచ్చం అందజేశారు.

ALSO READ : BREAKING : కెసిఆర్ ను కలిసిన ఏపీ సీఎం వైఎస్ జగన్.. రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం..!

కార్యక్రమంలో డిసిసి అధ్యక్షులు కేతావత్ శంకర్ నాయక్, పీసీసీ సభ్యులు పగిడి రామలింగయ్య , కిసాన్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు ముదిరెడ్డి నర్సిరెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు గాయం ఉపేందర్ రెడ్డి, నూకల వేణుగోపాల్ రెడ్డి, చిలుకూరి బాలు, పొదిల శ్రీనివాస్ , స్కైలాబ్ నాయక్, తమ్మడబోయిన అర్జున్, సజ్జల రవీందర్ రెడ్డి, శాగ జయేంద్ర రెడ్డి, దేశిడి శేఖర్ రెడ్డి, బండి యాదగిరి రెడ్డి ,

బలుగూరి శ్రీనివాస్, బంటు లక్ష్మీనారాయణ, గుండు నరేందర్ , జానీ, రామకృష్ణ , గోదాల జానకి రామ్ రెడ్డి , మేడ సురేందర్ రెడ్డి , సారెడ్డి శంకర్ రెడ్డి , ఉమర్, చలపతిరావు ,గాజుల శ్రీనివాస్, తక్కెళ్ళపల్లి శ్రీనివాస్, బెజ్జం సాయి, సిద్ది నాయక్, అజహారుద్దీన్ తదితరులు ఉన్నారు.

ALSO READ : కాంగ్రెస్ లో చేరిన షర్మిల.. వైఎస్ఆర్ టిపి విలీనం..!