తాజా సమాచారం అందించడంలో ముందున్న మనసాక్షి.. ఎమ్మెల్యే చిట్టెం పర్నికారెడ్డి..!
తాజా సమాచారం అందించడంలో ముందున్న మనసాక్షి.. ఎమ్మెల్యే చిట్టెం పర్నికారెడ్డి..!
మనసాక్షి క్యాలెండర్ ఆవిష్కరించిన ఎమ్మెల్యే చిట్టెం పర్నికారెడ్డి.
నారాయణపేట టౌన్:
నిరంతరం నిత్య నూతన వార్తలను ఎప్పటికప్పుడు ప్రజలకు చేరవేయటంలో మనసాక్షి పత్రిక ప్రజలకు చేరవేటంలో ముందుందని నారాయణపేట ఎమ్మెల్యే చిట్టెం పర్నికారెడ్డి అన్నారు.
బుధవారం స్థానిక సీవిఆర్ భవనంలో మన సాక్షి క్యాలెండర్ ను ఆవిష్కరించారు. అంతర్జాలం ద్వారా ప్రజలకు తాజా సమాచారం చేరవేస్తూ అనతికాలంలోనే తెలంగాణ ప్రజల మన్ననలు పొందినట్లు ఎమ్మెల్యే పర్నికారెడ్డి అన్నారు.
ALSO READ : Runa mafi : రైతు రుణమాఫీ పై రేవంత్ గుడ్ న్యూస్..!
ఈ పత్రికా రంగంలో అనతికాలంలోనే 170 దేశాలకు పైగా సమాచారాన్ని ప్రజలకు చేరవేయటంలో ముందున్నదని ఎమ్మెల్యే పర్నికారెడ్డి తన అభిప్రాయాన్ని వెల్లడించారు. పత్రికా రంగంలో పాత్రికేయులు సమాజ అభ్యున్నతికి ప్రజలకు దిక్సూచిగా ఉండాలని ఆమె కోరారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ శివారెడ్డి, మాజీ మార్కెట్ చైర్మన్ బండి వేణుగోపాల్, కౌన్సిలర్ సలీమ్, చిట్టె. మాదవరెడ్డి, దామరగిద్ద మాజీ ఎంపీటీసీ శేఖర్, కోనంగేరి హన్మంతు, లిక్కిరఘు, మన సాక్షి రిపోర్టర్ రమాకాంత్ లు పాల్గొన్నారు.
ALSO READ : BREAKING : కూరగాయల ట్రేలతో రవాణా.. పోలీసుల తనిఖీల్లో నల్గొండ జిల్లాలో బయటపడ్డ స్మగ్లింగ్..!









