Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
సినిమాBreaking NewsTOP STORIESవైద్యంహైదరాబాద్

Manchu : మంచు విష్ణు, మనోజ్ తోడబుట్టిన అన్నదమ్ములు కాదా..!

Manchu : మంచు విష్ణు, మనోజ్ తోడబుట్టిన అన్నదమ్ములు కాదా..!

మన సాక్షి :

మోహన్ బాబు ఫ్యామిలీ ఇప్పుడు వార్తల్లోకి ఎక్కింది. ఇండస్ట్రీలో మోహన్ బాబు ఫ్యామిలీ వివాదం సంచలనంగా మారింది. మంచు ఫ్యామిలీ అంటే మోహన్ బాబు,విష్ణు, మనోజ్ ఏకంగా కలిసి తీసిన సినిమాలు చాలా ఉన్నాయి. అయినా కూడా వాటిలో ఒకటి కూడా సక్సెస్ కాలేదు. అయితే ఇప్పుడు మంచు కుటుంబం తెరమీదకి వచ్చిన హాట్ టాపిక్ ఏంటంటే..?

వాస్తవానికి మంచి మనోజ్, విష్ణు అన్నదమ్ములు అనే విషయం తెలిసిందే. కానీ వీరు తోడబుట్టిన అన్న దమ్ములు కాదట. తండ్రి ఒక్కరే అయినప్పటికీ తల్లి మాత్రం వేరు వేరు అని తెలుస్తోంది. మంచు మోహన్ బాబు మొదట విద్యాదేవి అనే యువతిని వివాహం చేసుకున్నాడు. వీరికి మంచు లక్ష్మి, విష్ణు జన్మించారు. ఇక ఆ తర్వాత విద్యాదేవి అనారోగ్యంతో చనిపోయింది.

దాంతో విద్యాదేవి చెల్లెలు నిర్మలాదేవిని మోహన్ బాబు పెళ్లి చేసుకున్నాడు. అయితే నిర్మలాదేవి మోహన్ బాబుకు పుట్టిన సంతానమే మంచు మనోజ్. ఇలా మంచు విష్ణు మనోజ్ లు అన్నదమ్ములు అని తెలిసినప్పటికీ తోడబుట్టిన అన్నదమ్ములు మాత్రం కాదు. ఇద్దరికీ తల్లులు మాత్రం వేరు కావడం గమనార్హం.

ఇవి కూడా చదవండి :

మరిన్ని వార్తలు