తెలంగాణBreaking Newsజిల్లా వార్తలునల్గొండరాజకీయం

Sarpanch Elections : తక్కెళ్ళపల్లి సర్పంచ్ గా మేడెపు అంజయ్య ఏకగ్రీవం..!

Sarpanch Elections : తక్కెళ్ళపల్లి సర్పంచ్ గా మేడెపు అంజయ్య ఏకగ్రీవం..!

చింతపల్లి, మనసాక్షి :

నల్గొండ జిల్లా చింతపల్లి మండల పరిధిలోని తక్కలపల్లి గ్రామపంచాయతీకి ఎస్టి రిజర్వుడు కావడంతో గ్రామంలో (ఎరుకల) కుటుంబం నుండి ఒక్కరే కలిగి ఉండడంతో మేడెపు అంజయ్యకు ఏకగ్రీవ సర్పంచిగా అయ్యేందుకు అవకాశం దక్కింది.

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న స్థానిక సంస్థ ఎన్నికల్లో మండలంలోని 36 గ్రామ పంచాయతీలు ఉండగా తక్కల్లపల్లి గ్రామపంచాయతీ ఎస్టీ సర్పంచ్ అభ్యర్థి గా మేడపు అంజయ్య ఒక్కరే నామినేషన్ దాఖలు చేశారు. మరో అభ్యర్థి పోటీలో లేకపోవడంతో మేడపు అంజయ్య సర్పంచిగా ఏకగ్రీవం అయ్యారు.

ఉప సర్పంచ్ పదవి కోసం వార్డ్ మెంబర్లు ఇరు పార్టీల నుండి ఎన్నికల బరిలో నిలుచున్నారు. ఈ సందర్భంగా మంగళవారం ఎలక్షన్ క్లస్టర్ కేంద్రం కుర్మ్ డ్ లో ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఎంపీడీవో ఏకగ్రీవ ఎన్నిక వివరాలు అందజేశారు.

ఈ సందర్భంగా మేడపు అంజయ్య మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, దేవరకొండ నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్,గ్రామ పెద్దలు మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు తనకు ఇచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకొని

గ్రామ పెద్దలందరి సహాయ సహకారాలతో గ్రామ అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తానన్నారు. తక్కలపల్లి గ్రామాన్ని అన్ని విధాలుగా చింతపల్లి మండలంలో అభివృద్ధి పథంలో నడిపించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం అందించే పలు అభివృద్ధి సంక్షేమ పథకాలను ఇంటింటికి అందేలా కృషి చేస్తానన్నారు.

నన్ను ఆదరించి, అభిమానించి, ప్రోత్సహించిన గ్రామ పెద్దలందరికీ, కాంగ్రెస్ పార్టీ మండల నాయకులకు పెద్దలకు, ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.

MOST VIEWS 

  1. EV : సరికొత్త ఒలెక్ట్రా ఎలక్ట్రిక్ కారు.. గ్లోబల్ సమ్మిట్ లో ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి..!

  2. SBI : ఎస్బిఐలో పరీక్ష లేకుండా కేవలం ఇంటర్వ్యూ ద్వారానే ఉద్యోగాలు.. గడువు లేదు త్వరపడండి..!

  3. SBI : ఎస్బిఐలో పరీక్ష లేకుండా కేవలం ఇంటర్వ్యూ ద్వారానే ఉద్యోగాలు.. గడువు లేదు త్వరపడండి..!

  4. TG News : తెలంగాణ రైజింగ్, గ్లోబల్ సమ్మిట్ రేపటి నుంచే.. ఏంచేస్తారో తెలుసా..!

  5. Sarpanch Elections : తెలంగాణలో సర్పంచ్ ఎన్నికలు.. తొలివిడతలో ఏకగ్రీవాలు అన్ని వందలా..!

మరిన్ని వార్తలు