తెలంగాణBreaking Newsజిల్లా వార్తలునల్గొండవిద్య

Miryalaguda : ఎస్పిఆర్ పాఠశాలలో ఘనంగా మెగా బాల విజ్ఞాన వినోదిని..!

Miryalaguda : ఎస్పిఆర్ పాఠశాలలో ఘనంగా మెగా బాల విజ్ఞాన వినోదిని..!

మిర్యాలగూడ, మన సాక్షి :

నల్గొండ జిల్లా మిర్యాలగూడ లోని రామచంద్రగూడెం ఎస్.పి.ఆర్ ప్రాథమిక పాఠశాలలో గురువారం మెగా బాల విజ్ఞాన వినోదిని కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. విద్యార్థులలో అంతర్లీనంగా దాగివున్న కళలను, సృజనాత్మకతను ప్రోత్సహించేందుకు విద్యార్థులకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.

కార్యక్రమంలో విద్యార్థులు చిన్న చిన్న సందేశాత్మక నాటికలు, కథలు నైతిక విలువలను పెంపొందించే విధంగా ప్రదర్శించారు. అదే విధంగా రాగయుక్తంగా పద్యాలు, శ్లోకాలు, పాటలు పాడారు. సంస్కృతి సాంప్రదాయాలను ప్రోత్సహించే విధంగా విద్యార్థులు నృత్యాలు చేసి పలువురిని ఆకట్టుకున్నారు.

ఇలాంటి కార్యక్రమాల వల్ల విద్యార్థులలో ఉన్న భయం పారద్రోలడం జరుగుతుందని, అన్ని రంగాల్లో విద్యార్థులను ప్రోత్సహించడానికి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఎస్ పి ఆర్ స్కూల్ చైర్మన్ అలుగుబెల్లి కరుణాకర్ రెడ్డి పేర్కొన్నారు. కార్యక్రమంలో పాఠశాల వ్యవస్థాపకులు శ్రీపతి రెడ్డి, తెలంగాణ రాష్ట్ర పిఆర్టియు అధ్యక్షులు, పాఠశాల డైరెక్టర్ గార్లపాటి ఉమాకర్ రెడ్డి, డైరెక్టర్స్ యామిని వెంకటేశ్వర్లు, జొన్నలగడ్డ శ్రీనివాస్ రెడ్డి, నాదెండ్ల అయ్యన్న, ప్రిన్సిపల్ నీలిమారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

MOST READ :

  1. Hyderabad : ఆర్టీసీ, మెట్రో ప్రయాణికులకు శుభవార్త.. ప్రభుత్వం కీలక ప్రకటన..!

  2. Job Mela : 4న జాబ్ మేళ.. పదవ తరగతి , ఐటిఐ , ఇంటర్ అర్హతలతో ఉద్యోగాలు..! 

  3. Ration Cards : రేషన్ కార్డు ఉన్నవారికి మరో భారీ గుడ్ న్యూస్.. బిగ్ అప్డేట్..!

  4. Health : మెదడు చురుగ్గా ఉండాలా.. అయితే ఇలా చేయండి..!

  5. Pumpkin seeds : గుమ్మడి గింజలు తింటున్నారా.. అయితే ఇది తెలుసుకోండి.. లేదంటే డేంజరే..!

మరిన్ని వార్తలు