తెలంగాణBreaking Newsసంక్షేమం
Ration Cards : రేషన్ కార్డు ఉన్నవారికి మరో భారీ గుడ్ న్యూస్.. బిగ్ అప్డేట్..!
Ration Cards : రేషన్ కార్డు ఉన్నవారికి మరో భారీ గుడ్ న్యూస్.. బిగ్ అప్డేట్..!
మన సాక్షి, తెలంగాణ బ్యూరో :
తెలంగాణలో రేషన్ కార్డులు ఉన్న వారందరికీ ప్రభుత్వం సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. ఏప్రిల్ నెల నుంచి ఒక్కొక్కరికి 6 కిలోల చొప్పున సన్న బియ్యం పంపిణీ చేస్తున్నారు. అయితే త్వరలో మరో శుభవార్త అందించాలని ప్రభుత్వం భావిస్తుంది.
రేషన్ కార్డులు ఉన్న వారందరికీ అమ్మ హస్తం పేరుతో తొమ్మిది రకాల వస్తువులను గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం అందించేవారు. వాటిలో పప్పులు, పామాయిల్, గోధుమపిండి, చక్కెర, ఉప్పు, చింతపండు, మిరపకాయ, పసుపు, పిండి అందజేసేవారు.
త్వరలో రేషన్ షాపులలో పేదలకు కిట్ అందించాలని ప్రభుత్వం భావిస్తుంది. ఇందిరమ్మ అభయహస్తం పేరుతో ఈ పథకాన్ని అమలు చేయాలని భావిస్తుంది. ఎన్ని రకాల వస్తువులు ఇస్తారనే విషయంపై చర్చిస్తున్నట్లు సమాచారం.
MOST READ :









