ఆంధ్రప్రదేశ్Breaking Newsక్రైం
హోమ్ శాఖ మంత్రి అనిత ఎక్స్ ఖాతా హ్యాక్.. అధికారుల అలర్ట్..!
ఆంధ్రప్రదేశ్ హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత ఎక్స్ ఖాతా హ్యాక్ అయింది. దాంతో హోం మంత్రి కార్యాలయ అధికారులు అలర్ట్ జారీ చేశారు.

హోమ్ శాఖ మంత్రి అనిత ఎక్స్ ఖాతా హ్యాక్.. అధికారుల అలర్ట్..!
మన సాక్షి, వెబ్ డైస్క్:
ఆంధ్రప్రదేశ్ హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత ఎక్స్ ఖాతా హ్యాక్ అయింది. దాంతో హోం మంత్రి కార్యాలయ అధికారులు అలర్ట్ జారీ చేశారు. అకౌంట్ సైబర్ కు గురైనందున పోస్ట్ చేసిన అంశాలను అధికారికంగా పరిగణించవద్దని హోంమంత్రి కార్యాలయం అధికారులు ప్రకటించారు.
హోమ్ మంత్రి అనిత ఎక్స్ ఖాతా హ్యాక్ అయిందని.. ఈ సమయంలో ఎకౌంటు నుంచి అనధికార పోస్టులు జరుగుతున్నట్లు అధికారులు గుర్తించారు. అకౌంటు సైబర్ దాడికి గురైన నేపథ్యంలో పోస్ట్ చేసిన అంశాలను పరిగణలోకి తీసుకోవద్దని అధికారులు పేర్కొన్నారు. ప్రజలు, మీడియా, ఫాలోవర్లకు హోంశాఖ కార్యాలయం విజ్ఞప్తి చేసింది. అయితే ఖాతా హ్యాక్ అవడంపై ఇప్పటికి పోలీసులకు హోం శాఖ మంత్రి ఫిర్యాదు చేశారు. దాంతో హ్యాక్ చేసిన వారిని గుర్తించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.









