Breaking Newsక్రైంజిల్లా వార్తలుహైదరాబాద్
మైనర్ బాలికపై బంధువులే సామూహిక అత్యాచారం..!
కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన బంధువులే మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం చేసిన ఘటన కీసర లో చోటుచేసుకుంది.

మైనర్ బాలికపై బంధువులే సామూహిక అత్యాచారం..!
మన సాక్షి, వెబ్ డెస్క్:
కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన బంధువులే మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం చేసిన ఘటన కీసర లో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇది కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో కలకలం రేపింది. సొంత అన్నే చెల్లెలిపై లైంగిక దాడికి పాల్పడిన ఘటన కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.
దాంతో కీసర పోలీసులు ఫోక్సో చట్టం కేసు నమోదు చేసి నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటనలో మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నట్లు పోలీసులు పేర్కొన్నారు. పరారీలో ఉన్న వారి కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపడుతున్నట్లు తెలిసింది. అనంతరం బాదిత చిన్నారికి వైద్య పరీక్షలు నిర్వహించి చట్టపరమైన చర్యలు చేపట్టనున్నట్టు పోలీసులు పేర్కొన్నారు.









