Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండవిద్య

MGU : మహాత్మా గాంధీ యూనివర్సిటీలో  భోజనములో గుట్కా ప్యాకెట్.. విద్యార్థుల ఆందోళన..!

మహాత్మా గాంధీ యూనివర్సిటీలో విద్యార్థుల భోజనంలో గుట్కా ప్యాకెట్ రావడంతో విద్యార్థులు తీవ్ర ఆగ్రహానికి గురై బాధ్యులను కఠినంగా శిక్షించాలని ఎంజీయూ గేటు ముందు ధర్నా నిర్వహించారు.

MGU : మహాత్మా గాంధీ యూనివర్సిటీలో  భోజనములో గుట్కా ప్యాకెట్.. విద్యార్థుల ఆందోళన..!

నల్లగొండ, మన సాక్షి:

మహాత్మా గాంధీ యూనివర్సిటీలో విద్యార్థుల భోజనంలో గుట్కా ప్యాకెట్ రావడంతో విద్యార్థులు తీవ్ర ఆగ్రహానికి గురై బాధ్యులను కఠినంగా శిక్షించాలని ఎంజీయూ గేటు ముందు ధర్నా నిర్వహించారు. ఉదయం విద్యార్థులకు పెట్టిన జీరారైస్‌లో గుట్కా ప్యాకెట్ రావడంతో విద్యార్థుల ఆరోగ్య భద్రత పెద్ద ప్రమాదంగా మారిందని నాయకులు మండిపడ్డారు.

గతంలో కూడా అన్నంలో క్రిమికీటకాలు బయటపడిన సంఘటనలు ఉన్నప్పటికీ యూనివర్సిటీ యాజమాన్యం, ముఖ్యంగా వైస్ ఛాన్స్లర్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఈ ఘటనపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఏబీవీపీ నాయకులు గిన్నెలతో యూనివర్సిటీ మెయిన్ గేట్ వద్ద బైఠాయించి తీవ్ర నిరసన తెలిపారు.

ALSO READ :NLG : రైతు నుంచి రూ. 20 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన రెవెన్యూ ఇన్స్పెక్టర్..!

విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడే విధంగా వ్యవహరిస్తున్న యూనివర్సిటీ అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఏబీవీపీ ఎంజీయూ అధ్యక్షులు హనుమాన్ చారి మాట్లాడుతూ విద్యార్థుల ఆరోగ్యం కంటే యాజమాన్యానికి విద్యార్థుల హాజరు శాతం ముఖ్యమని, పునరావృతమవుతున్న ఘటనలపై వైస్ ఛాన్స్లర్ స్పందించకపోవడం దారుణం అన్నారు.

వెంటనే బాధ్యులపై చర్యలు తీసుకొని, నాణ్యమైన ఆహారం అందించే వరకు మా ఆందోళన ఆగదు” అని హెచ్చరించారు. సుమారు మూడు గంటల పాటు జరిగిన ఆందోళనతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. అనంతరం పోలీసులు జోక్యం చేసుకొని వైస్ ఛాన్స్లర్‌ను పిలిపించగా సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో విద్యార్థులు తాత్కాలికంగా ఆందోళన విరమించారు.

అయితే హామీలు అమలు కాకపోతే మరింత భారీ స్థాయిలో ఉద్యమం చేపడతామని ఏబీవీపీ నాయకులు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి నాయకులు మోహన్, ఛత్రపతి, మౌనేష్, సుధీర్, అజయ్, సతీష్, శంకర్, సూర్య, విజయ్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

MOST READ 

  1. Miryalaguda : మున్సిపల్ కమిషనర్ ఆదేశం.. ఇంటింటికి వెళ్లి ఓటర్ స్లిప్పులు పంచాలి..!

  2. Rythu Bharosa : రైతు భరోసా శాటిలైట్ సర్వే పూర్తి.. షాకింగ్ నిజాలు, లేటెస్ట్ అప్డేట్..!

  3. Tragedy : తీవ్ర విషాదం.. హైదరాబాద్ లో రైలు కిందపడి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి..!

  4. Hyderabad : ఏటీఎం వద్ద వ్యక్తిపై కాల్పులు.. రూ.6 లక్షలు చోరీ, సీసీటీవీలో రికార్డు..!

మరిన్ని వార్తలు