తెలంగాణBreaking Newsఅభివృద్దిజిల్లా వార్తలుసంగారెడ్డి జిల్లా

Andol : అందోల్‌ చెరువును మినీ ట్యాంకుబండ్‌గా తీర్చిదిద్దాలి.. మంత్రి దామోదర రాజనర్సింహా ఆదేశం..!

Andol : అందోల్‌ చెరువును మినీ ట్యాంకుబండ్‌గా తీర్చిదిద్దాలి.. మంత్రి దామోదర రాజనర్సింహా ఆదేశం..!

అందోలు, మనసాక్షి:

అందోలు –జోగిపేట మున్సిపాలిటీ పరిధిలోని అందోలు చెరువును మిని ట్యాంకుబండ్‌గా మార్చి పర్యాటకుల కోసం ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు రూపొందించాలని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్‌ రాజనర్సింహ అన్నారు.

మంగళవారం అందోల్‌ జోగిపేట మున్సిపల్‌ అభివృద్ధిపై అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. అందోల్‌ మున్సిపాలిటీ పరిధిలోని అందోల్‌ జోగిపేట పట్టణాల అభివృద్ధి కోసం ఎన్ని నిధులైన తీసుకురానినట్లు మంత్రి ప్రకటించారు. అందోల్‌ చెరువు కట్టను మినీ ట్యాంక్‌ బండ్‌ గా అభివృద్ధి చేసి అందోల్‌ చెరువులో బోటింగ్‌ సౌకర్యం ఇతర వినోద కార్యక్రమాల కల్పనకు ఏర్పాట్లు చేయనున్నట్లు తెలిపారు.

అందోల్‌ చెరువు కట్ట పై పర్యాటకులను ఆకర్షించే విధంగా ఆహ్లాదకరంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు రూపొందించాలని మంత్రి దామోదర్‌ రాజనర్సింహ పర్యటన శాఖ అధికారులను ఆదేశించారు. ఆందోల్‌ ట్యాంక్‌ బండ్‌ పర్యటకుల కోసం బోటింగ్‌ సౌకర్యం రెస్టారెంట్‌ ఏర్పాటు, ట్యాంక్‌ బండ్‌ యుటిఫికేషన్‌ వాకింగ్‌ ట్రాక్‌ నిర్మాణం పై అధికారులతో మంత్రి చర్చించారు.

జిల్లాకే తలమానికంగా మున్సిపాల్‌ అభివృద్ధిః

అందోలు ,జోగిపేట మున్సిపాలిటీని జిల్లాలోని తలమానికంగా అభివృద్ధి చేయనున్నట్లు మంత్రి దామోదర్‌ అన్నారు. పట్టణంలో నిర్మిస్తున్న ఆధునిక లైబ్రరీ మున్సిపల్‌ ఆఫీస్‌ పనుల పురోగతిపై చర్చించారు. అందోల్‌ జోగిపేట మున్సిపాలిటీలో ఉన్న గాంధీ పార్క్‌ ఆధునికరణ పనులు వెంటనే పూర్తయ్యేలా చూడాలని మున్సిపల్‌ కమిషనర్‌ ను మంత్రి ఆదేశించారు.

అందోల్‌ మున్సిపాలిటీ అభివృద్ధి కోసం తెలంగాణ ఇన్ఫ్రాస్ట్రక్చర్‌ డెవలప్మెంట్‌ కార్పొరేషన్‌ (టియుఎఫ్‌ఐడీపి) కింద రూ. 30.20కోట్ల రూపాయలు మంజూరు చేసినట్లు మంత్రి తెలిపారు. ఈ నిధులతో చేపడుతున్న పనుల పురోగతిపై మంత్రి చర్చించారు. మున్సిపాలిటీలో చేపడుతున్న అభివృద్ధి పనులు వెంటనే పూర్తి చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు.

విద్యాసంస్థల ఏర్పాటుకు స్థలాలను గుర్తించాలి

ప్రభుత్వ సంస్థలను నెలకొల్పేందుకు అవసరమైన ప్రభుత్వ స్థలాన్ని గుర్తించేందుకు అందోలు శివారులోని 1141 సర్వే నంబర్‌లోని స్థలాన్ని అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సర్వేనంబర్‌లోని ప్రభుత్వ స్థలంలో నర్సింగ్‌ కళాశాల, 150 పడకల ప్రభుత్వాసుపత్రి, మైనార్టీ బాలుర, బాలికల రెసిడెన్షియల్‌ పాఠశాలలు, మహాత్మ జ్యోతిరావు పూలే పాఠశాల,

బీఫార్మసీ కళాశాలతో పాటు 30 ఎకరాల్లో నవోదయ పాఠశాల, స్వామి వివేకానంద విగ్రహం వద్ద రెండు ఎకరాల్లో పార్కు వంటి వాటిని ఏర్పాటు చేసుకునేందుకు వీలుగా స్థలాలను గుర్తించాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆందోల్‌ ఆర్డిఓ పాండు నాయక్‌ , పబ్లిక్‌ హెల్త్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ తిరుపతి కుమార్, ఆందోల్‌ జోగిపేట మున్సిపల్‌ కమిషనర్‌ తిరుపతిలో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

MOST READ :

  1. District Collector : నారాయణపేట – కొడంగల్ ఎత్తిపోతల పథకం.. భూసేకరణ యుద్ధ ప్రాతిపదికన భూసేకరణ.. జిల్లా కలెక్టర్..!

  2. District Collector : జిల్లా కలెక్టర్ సీరియస్ వార్నింగ్.. యూరియా బ్లాక్ లో అమ్మితే లైసెన్సులు రద్దు..!

  3. Nalgonda : రైతుబంధు కేసీఆర్ నాట్లప్పుడు ఇస్తే.. రేవంత్ ఓట్లప్పుడు ఇస్తాడు..!

  4. Gold Price : పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. వరుసగా పడిపోయిన గోల్డ్ రేట్.. ఈరోజు ఎంతంటే..!

  5. Nalgonda : గులాబీ మయమైన నల్గొండ..!

మరిన్ని వార్తలు