తెలంగాణBreaking Newsజిల్లా వార్తలునల్గొండపండుగలు

Minister Komatireddy : శివ నామ స్మరణలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి..!

నల్గొండ జిల్లా కేంద్రంలోని పానగల్ ఛాయా సోమేశ్వరాలయాన్ని ప్రపంచ వారసత్వ సంపదగా యునెస్కో గుర్తించాలని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమటోగ్రాఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు.

Minister Komatireddy : శివ నామ స్మరణలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి..!

ఛాయా సోమేశ్వరాలయాన్ని యునెస్కో గుర్తించాలి.

దేవాలయంలో నిచ్చల ఛాయ మహా అద్భుతం.

చారిత్రాత్మక ఆలయాలను పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు కృషి.

రాష్ట్ర రోడ్లు,భవనాలు, సినిమటోగ్రఫీ శాఖమంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి.

మహాశివరాత్రి సందర్భంగా పానగల్ పచ్చల,ఛాయా సోమేశ్వరాలయాలలో ప్రత్యేక పూజలు.

రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు అందజేసిన మంత్రి.

నల్లగొండ, మన సాక్షి :

నల్గొండ జిల్లా కేంద్రంలోని పానగల్ ఛాయా సోమేశ్వరాలయాన్ని ప్రపంచ వారసత్వ సంపదగా యునెస్కో గుర్తించాలని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమటోగ్రాఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. మహా శివరాత్రి సందర్భంగా ఆదివారం నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ పానగల్ లోని చారిత్రాత్మక పచ్చల, ఛాయా సోమేశ్వరాలయాలలో మంత్రి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పానగల్ లోని పచ్చల,ఛాయా సోమేశ్వరాలయాలను ఆధ్యాత్మికంగా, పర్యాటకంగా అభివృద్ధి చేయాలన్నదే తన లక్ష్యమన్నారు. ఛాయా సోమేశ్వరాలయానికి యునెస్కో గుర్తింపు వల్ల ఎన్నో నిధులు వస్తాయని తెలిపారు. కేంద్రం కేంద్ర ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్లి వారసత్వ సంపదగా గుర్తించే విధంగా చర్యలు తీసుకుంటానని పేర్కొన్నారు.

11 -12 వ శతాబ్దంలో చోళులు ఈ ఛాయా సోమేశ్వరాలయంను నిర్మించారని అన్నారు.
గర్భగుడిలో శివలింగం మీద రోజంతా ఒక స్తంభం నీడ నిరంతరంగా పడడం మహా అద్భుతం అన్నారు. యునెస్కో జాబితాలో చేరడం వల్ల దేవాలయాల యొక్క విశిష్టత ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందుతుందన్నారు.
అంతర్జాతీయ మాధ్యమాలలో విస్తృత ప్రచారం జరుగుతుందన్నారు. దీంతో పర్యాటకం పెరగడం వల్ల ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయని తెలిపారు.

స్థానికులకు తమ వారసత్వ సంపద గురించి అవగాహన పెరుగుతుందని అన్నారు. పచ్చల, ఛాయా సోమేశ్వరాలయం గోడలపై అద్భుత శిల్పకళ ఉందన్నారు. పర్యాటకంగా మరింత అభివృద్ధి చేసేందుకు అన్ని విధాలుగా కృషి చేస్తానని మంత్రి స్పష్టం చేశారు. పానగల్ సమీపంలో ఉన్న చందనపల్లి డంపింగ్ యార్డును త్వరలోనే ఇక్కడి నుంచి మరో చోటికి తరలించడం జరుగుతుందన్నారు.

MOST READ 

  1. Nalgonda : స్పటిక లింగ మల్లేశ్వర స్వామి ఆలయంలో పార్దివ లింగార్చనము..!

  2. Rythu Bharosa : రైతుల ఖాతాలలో భరోసా ఎకరానికి రూ.6000.. కొందరికేనా.. అందరికా.. లేటెస్ట్ అప్డేట్..!

  3. TG News: మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ హవా.. ఏ మునిసిపాలిటీలో ఏ పార్టీ గెలిచిందో తెలుసుకుందాం..!

  4. TG News : మంత్రి పొంగులేటి సమక్షంలో కాంగ్రెస్‌లోకి కొత్తగూడెం స్వతంత్ర కార్పొరేటర్లు..!

మరిన్ని వార్తలు