Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండరాజకీయం

MIRYALAGUDA : మిర్యాలగూడ మున్సిపల్ చైర్మన్ ఎంపిక.. మాజీ చైర్మన్ భార్గవ్ కీలక కామెంట్..!

నల్గొండ జిల్లా మిర్యాలగూడ మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాలు గెలుచుకుంది. 48 కౌన్సిలర్ స్థానాలకు గాను 31 స్థానాలను కైవసం చేసుకుంది. కానీ చైర్మన్ ఎంపిక విషయంలో నలుగురి మధ్య పోటీ కొనసాగుతున్నట్లు సమాచారం.

MIRYALAGUDA : మిర్యాలగూడ మున్సిపల్ చైర్మన్ ఎంపిక.. మాజీ చైర్మన్ భార్గవ్ కీలక కామెంట్..!

మిర్యాలగూడ, మన సాక్షి:

నల్గొండ జిల్లా మిర్యాలగూడ మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాలు గెలుచుకుంది. 48 కౌన్సిలర్ స్థానాలకు గాను 31 స్థానాలను కైవసం చేసుకుంది. కానీ చైర్మన్ ఎంపిక విషయంలో నలుగురి మధ్య పోటీ కొనసాగుతున్నట్లు సమాచారం. కాగా మున్సిపల్ చైర్మన్ ఎంపిక విషయంపై మాజీ మున్సిపల్ చైర్మన్ తిరునగరం భార్గవ్ కీలక వ్యాఖ్యలు చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

భార్గవ్ సోషల్ మీడియా లో పోస్ట్ చేసిన విషయాలు యదావిధిగా..

మిర్యాలగూడ పట్టణ ప్రజలకు విజ్ఞప్తి

రెండు రోజుల నుండి సోషల్ మీడియాలో మున్సిపల్ చైర్మన్ ఎంపిక గురించి రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. బీసీ సామజికవర్గానికి ఇవ్వాలి అని కొందరు. ఆర్యవైశ్యులకు ఇవ్వాలి అని కొందరు. నూకల కవిత వేణుగోపాల్ రెడ్డి గారికి ఇవ్వాలి అని కొందరు. మరి కొందరు ఏమో గత 10 సంవత్సరాలు ఆర్యవైశ్యులు చైర్మన్ గా ఉన్నారు.. మళ్ళీ వాళ్ళకి ఎందుకు అని.

ప్రతి మనిషికి కులం ఉంటాది మాకు ఉంది మేము కులానికి ఆర్యవైశ్యలము. కాని ఈ ప్రాంతంలో సుమారు గా 60 సంవత్సరాలగా రాజకీయాల్లో మా కుటుంబం SC BC మైనారిటీ OC అన్ని వర్గాలతో కలసి పని చేస్తూ ఉన్నాము. మాకు ఏ అవకాశం వచ్చిన అది ప్రజల ఆసిస్సులతో వచ్చింది కాని కులం పేరు మీద రాలేదు.

2014 లో కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్స్ ముందు గా చైర్మన్ అభ్యర్థి గా నాగలక్ష్మిభార్గవ్ గారిని ప్రకటించి ఎన్నికలలో ప్రజల వద్దకు వెళ్ళింది.
2020 లో కూడ నన్ను ముందే ప్రకటించి ప్రజల వద్దకి వెళ్ళింది. గత రెండు మున్సిపల్ ఎన్నికలు ఎటువంటి కులాల మధ్యలో తగువులు లేవు. మా కుటుంబం పూర్తిగా రాజకీయలలో ఉన్న విషయం మీందరికి తెలుసు.

మున్సిపల్ ఛైర్మన్ గా ఎంపిక అన్నది గౌరవ ఎంపీ గారు, గౌరవ శాసనసభ్యులు గారు
మరియు పార్టీ నిర్ణయం మేరకు ఎంపిక చేస్తారు. మున్సిపల్ ఛైర్మన్ కావాలని అడిగేవాళ్ళు పార్టీ కి ఎంత పనిచేసారు.. అని MP గారు, MLA గారు మరియు పార్టీ పెద్దలు చూస్తారు.  కామెంట్స్ పెట్టే వాళ్ళకి సూచన
మీరు మీకు నచ్చిన వ్యక్తి పేరును చెప్పండి.
కులాల మధ్యలో పంచాయతీ పెట్టకండి.
ఎటువంటి వివాదహాస్పద కామెంట్స్ చేయకండి.

MOST READ  : 

  1. Municipal Elections : తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాల అధికారిక ప్రకటన.. ఎవరికి ఎంత శాతం వార్డులు..!

  2. BREAKING : రోడ్డు ప్రమాదం.. ఆరుగురు దుర్మరణం..!

  3. TG News: మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ హవా.. ఏ మునిసిపాలిటీలో ఏ పార్టీ గెలిచిందో తెలుసుకుందాం..!

  4. Rythu Bharosa : రైతుల ఖాతాలలో భరోసా ఎకరానికి రూ.6000.. కొందరికేనా.. అందరికా.. లేటెస్ట్ అప్డేట్..!

మరిన్ని వార్తలు