Minister Ponguleti : మిర్యాలగూడ వేదికగా మంత్రి పొంగులేటి సంచలన ప్రకటన.. తల తాకట్టు పెట్టైనా వారికి ఇందిరమ్మ ఇళ్లు..!
Minister Ponguleti : మిర్యాలగూడ వేదికగా మంత్రి పొంగులేటి సంచలన ప్రకటన.. తల తాకట్టు పెట్టైనా వారికి ఇందిరమ్మ ఇళ్లు..!
రాబోయే రోజుల్లో 20 లక్షల ఇందిరమ్మ ఇళ్లు
అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళు
మిర్యాలగూడలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు పట్టాల పంపిణీ
రాష్ట్ర రెవిన్యూ ,గృహ నిర్మాణ, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
మిర్యాలగూడ, మన సాక్షి :
ఇచ్చిన మాట ప్రకారం తల తాకట్టు పెట్టైనా మొదటి విడతనే కాకుండా, రెండు, మూడు, నాలుగు విడతల్లో ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని రాష్ట్ర రెవిన్యూ ,గృహ నిర్మాణ, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. సోమవారం ఆయన నల్గొండ జిల్లా, మిర్యాలగూడ పట్టణంలో నిర్వహించిన ఇందిరమ్మ ఇండ్ల పట్టాల పంపిణీ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ….. రానున్న మూడున్నర ఏళ్లలో రాష్ట్ర వ్యాప్తంగా 20 లక్షల ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని, మొదటి విడతన నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందలు చొప్పున 22500 కోట్లు ఇస్తున్నామన్నారు. ఇందిరమ్మ ఇళ్లు నిర్మించుకున్న లబ్ధిదారులకు ప్రతి సోమవారం బిల్లులు చెల్లిస్తున్నామని, రాబోయే వారం, పది రోజుల్లో పైలెట్ గ్రామాలలో గృహప్రవేశాలు చేసుకోబోతున్నామని,400 చదరపు అడుగులు నుండి 600 చదరపు అడుగులలోపు ఇందిరమ్మ ఇండ్లు నిర్మించుకునేలా నిర్ణయించడం జరిగిందన్నారు.
లబ్ధిదారులు ఎంత త్వరగా ఇల్లు పూర్తి చేసుకుంటే అంత త్వరగా బిల్లు ఇస్తామని,పేదవాడి కల నెరవేర్చాలి అన్నదే తమ లక్ష్యం అన్నారు.అందుకే మొదటి విడత రాష్ట్ర వ్యాప్తంగా నాలుగున్నర లక్షల ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నామని, గతంలో కూడా తాము అధికారంలో ఉన్నప్పుడే అత్యధికంగా ఇందిరమ్మ ఇళ్లు నిర్మించి ఇచ్చామన్నారు. అభివృద్ధి, సంక్షేమాన్ని రెండు కళ్లతో పేదలకు అందించాలన్నది ప్రభుత్వ నిర్ణయమని, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గాడిలో పెడుతూ సంక్షేమ పథకాలన్నింటినీ అమలు చేస్తున్నామని తెలిపారు.
ఆగస్టు 15 నాటికి భూ భారతి ద్వారా భూములు ఉన్న ఆసాములకు పూర్తి స్వేచ్ఛను కల్పిస్తామని,ఈ నెల 20 నుండి ఆగస్టు 15 నాటికి ఈ సమస్యలను పరిష్కరించనున్నాము. భూభారతి చత్తాన్ని దేశ వ్యాప్తంగా 18 రాష్ట్రాల్లో పర్యటించి అన్ని విషయాలను క్రోడీకరించి అద్భుతమైన చట్టాన్ని తయారు చేశామన్నారు. ఏప్రిల్ 14న భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పుట్టినరోజున ప్రజలకు అంకితం చేశామని, భూ భారతి రెవెన్యూ సదస్సులలో అధికారులే దరఖాస్తులు రాస్తారని పేర్కొన్నారు. భూ సమస్యల పరిష్కారానికి ఒక్క రూపాయి కూడా ఇవ్వాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పారు.
తాహాసిల్దార్, ఆర్డిఓ ,కలెక్టర్ తప్పులు చేస్తే సీసీఎల్ఏ వరకు అప్పీల్ చేసుకునే అధికారం ఉంటుందన్నారు. ధరణిలో ఇలాంటి అవకాశం లేదని, దేశానికి మన రెవెన్యూ వ్యవస్థ రోల్ మోడల్ గా ఉండబోతుందని పేర్కొన్నారు.వచ్చే అసెంబ్లీలో ఎన్నికల్లో భూభారతి చట్టాన్ని రెఫరండంగా పెట్టుకుని వెళ్తామని,పేదల కోసమే ప్రభుత్వం పని చేస్తుందన్నారు. సాదా బై నామాలకు సంబంధించి 9 లక్షల 25 వేల దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయన్నారు. ధరణిలో వీటి పరిష్కారానికి అవకాశం లేదని,భూ భారతిలో అలాంటి అవకాశాన్ని కల్పించామన్నారు.
ఆధార్ కార్డులాగే ఆధార్ కార్డుని ఇచ్చి ఖాతా నెంబర్ ను ఇస్తున్నామని,రానున్న 30 రోజుల్లో రాష్ట్రంలో ఆరు వేల మంది లైసెన్స్ డ్ సర్వేయర్ లను నియమించుతున్నామని తెలిపారు. పదివేల 956 రెవిన్యూ గ్రామాలలో గ్రామ పాలన అధికారులను నియమించుతున్నావని,ప్రతి డిసెంబర్ 31న జమాబంది ఏర్పాటు చేసేలా చట్టంలో పెట్టామన్నారు.
రాష్ట్ర శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ…ఇందిరమ్మ ఇండ్ల కోసం 18 లక్షల దరఖాస్తులు రాగా , దాదాపు 16 లక్షల50 వేల వరకు ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందినాలుగు లక్షల ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలని నిర్ణయించినది, ప్రతి నియోజకవర్గంలో 3500 ఇండ్లు ఇస్తున్నామన్నారు. చాలా ఏళ్ళ తర్వాత ఇండ్లు వచ్చాయన్నారు.
రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. మిర్యాలగూడ ప్రాంతంలో కృష్ణా నదిపై మిగిలిపోయిన ప్రాజెక్టులతో లిపులను మొదలు పెట్టి పూర్తి చేస్తామని తెలిపారు. నాగార్జునసాగర్ ఎడమ కాలువ మరమ్మత్తులకు త్వరలోనే ఏడు కోట్ల రూపాయలు మంజూరు చేస్తాం అన్నారు.తెలంగాణకు కృష్ణా జలాలలో తెలంగాణకు న్యాయం జరిగేలా పోరాడి తీరుతామని,మా హయాంలోనే ఎస్ఎల్బీసీ టన్నెల్ను పూర్తి చేస్తాం అని,30 టీఎంసీల ద్వారా ఉమ్మడి నల్గొండ జిల్లాలో సాగు నీరందిస్తామన్నారు. ధర్మారెడ్డి, పిల్లాయిపల్లి, బునియాదిగాని కాలువ పనులు పూర్తిచేసి తీరుతామని, ఉమ్మడి నల్గొండ జిల్లాలోని అన్ని ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తి చేస్తామన్నారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ,తెలంగాణ లో ఇప్పటివరకు పండించని విధంగా రికార్డు స్థాయిలో వరి ధాన్యాన్ని పండించి ఖరీఫ్, రబీలలో 280 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని పండించి తెలంగాణ రాష్ట్రం దేశంలోనే నెంబర్ వన్ గా నిలిచింది.
వరి కొనుగోలు చెల్లింపులలో భాగంగా 12 లక్షల మంది రైతులకు 15126 కోట్ల రూపాయలు చెల్లించామని, యాసంగిలోనే 73 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశాం అని పేర్కొన్నారు. సన్నధాన్యానికి 500. బోనస్ ఇచ్చామన్నారు. సన్న బియ్యం కింద అర్హులైన ప్రతి ఆరు కిలోల బియ్యం చొప్పున ఇస్తున్నామని, అర్హులందరికీ రేషన్ కార్డులు ఇస్తామన్నారు.
రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ….రాష్ట్రంలో ప్రతి నియోజక వర్గం వారీగా 3500 మందికి ఐదు లక్షల రూపాయల చొప్పున ఇండ్ల నిర్ణయమని ఈ ప్రభుత్వంలో పేదలు బాగుండాలని ప్రతి పేదవాడికి 5 లక్షలతో ఇళ్లు కట్టిస్తున్నామన్నారు. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించడం పేదలందరూ బాగుండాలనేది మా ఆకాంక్ష అన్నారు. గత ప్రభుత్వం కావాలనే ఎస్ఎల్బీసీ పూర్తి చేయలేదని ధర్మారెడ్డి,పిల్లయిపల్లి అన్ని పూర్తి చేస్తామని,జిల్లాను అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తామన్నారు.
జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ…ఇందిరమ్మ ఇండ్లు వచ్చిన వారు 30 రోజుల్లో ఇ ళ్లు కట్టుకోవాలి,దశలవారీగా నిధులు మంజూరు చేస్తామన్నారు. సిమెంటు ,ఇటుక ,స్టీల్ ధరల నిర్ణయానికి మండల స్థాయిలో కమిటీలు వేశామని తెలిపారు.
రాష్ట్ర శాసనమండలి సభ్యులు శంకర్ నాయక్ ,రెవిన్యూ అదనపు కలెక్టర్ జే. శ్రీనివాస్,సబ్ కలెక్టర్ నారాయణ అమిత్ మాట్లాడగా, ఈ కార్యక్రమానికి శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి అధ్యక్షత వహించారు. నకిరేకల్ శాసనసభ్యులు వేముల వీరేశం, గృహ నిర్మాణ శాఖ పిడి రాజకుమార్, తాసిల్దారులు ఇతర అధికారులు, తదితరులు హాజరయ్యారు.
MOST READ :
-
District SP : జిల్లా ఎస్పీ కీలక సూచన.. ఆ స్కీముల పట్ల అప్రమత్తంగా లేకుంటే మోసపోతారు..!
-
DISTRICT COLLECTOR : ప్రజావాణికి దరఖాస్తుల వెల్లువ.. సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ఆదేశం..!
-
Rythu Bharosa : రైతు భరోసా ఆ లోపే.. మంత్రి తుమ్మల క్లారిటీ..!
-
Rythu Bharosa : రైతు భరోసా ఆ లోపే.. మంత్రి తుమ్మల క్లారిటీ..!
-
Rythu Bharosa : రైతు భరోసా పై కీలక అప్డేట్.. మంత్రివర్గంలో ఏం చర్చించారు.. తుమ్మల క్లారిటీ..!














