Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
క్రైంBreaking Newsజిల్లా వార్తలునల్గొండ

Miryalaguda : గుర్తుతెలియని వాహనం ఢీకొని మహిళ మృతి..!

Miryalaguda : గుర్తుతెలియని వాహనం ఢీకొని మహిళ మృతి..!

మిర్యాలగూడ, మన సాక్షి :

గుర్తు తెలియని వాహనం ఢీకొని మహిళ మృతి చెందిన సంఘటన మిర్యాలగూడ మండలంలోని కిష్టపురంలో చోటుచేసుకుంది. మిర్యాలగూడ రూరల్ ఎస్సై నరేష్ తెలిపిన వివరాల ప్రకారం

నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం కృష్ణాపురం గ్రామంలో గణేష్ విగ్రహ ఊరేగింపు చూసిన అనంతరం పల్లా సైదమ్మ ( 55) సోమవారం రాత్రి 12 గంటల సమయంలో ఇంటికి నడుచుకుంటూ వెళుతుంది. దామరచర్ల వైపు నుండి మిర్యాలగూడ వైపు వస్తున్న గుర్తు తెలియని వాహనం అతివేగంగా ఆమెను ఢీ కొట్టింది.

దాంతో ఆమె తలకు, కాళ్లకు బలమైన గాయాలు అయ్యాయి. ఆమెను 108 వాహనంలో మిర్యాలగూడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆమె చనిపోయింది. దాంతో మృతురాలు పెద్ద కుమారుడు పల్లా విజయ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

LATEST UPDATE :

రైతు భరోసా ఇచ్చే ఉద్దేశ్యం ఉందా.. రుణమాఫీ లెక్కనేనా.!

డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కోసం దరఖాస్తు స్వీకరణ.. 17 వరకు గడువు పెంపు..!

Heavy Rain : ఆత్మహత్యే శరణ్యం.. కౌలు రైతు కుటుంబం ఆవేదన..!

Nalgonda : తప్పుడు పత్రాలతో ఇండ్ల స్థలాలను రిజిస్ట్రేషన్ చేసుకున్న జర్నలిస్టులపై చర్య తీసుకోవాలని కలెక్టర్, ఎస్పీకి ఫిర్యాదు..!

మరిన్ని వార్తలు