Breaking Newsక్రైంజిల్లా వార్తలునల్గొండ

Miryalaguda : రోడ్డు ప్రమాదంలో గాయపడిన చిన్నారి చికిత్స పొందుతూ మృతి..!

నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలంలోని కిస్టాపురం గ్రామంలో రోడ్డు దాటుతుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి చెందింది.

Miryalaguda : రోడ్డు ప్రమాదంలో గాయపడిన చిన్నారి చికిత్స పొందుతూ మృతి..!

మిర్యాలగూడ, మన సాక్షి :

నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలంలోని కిస్టాపురం గ్రామంలో రోడ్డు దాటుతుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో పదేళ్ల చిన్నారి మృతి చెందింది. మిర్యాలగూడ రూరల్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కిష్టాపురం గ్రామంలో బెజవాడ చంద్రమ్మ (60), ఆమె మనవరాలు చందన (10) రోడ్డు దాటుతుండగా వాడపల్లి వైపు నుంచి మిర్యాలగూడ వైపుకు వస్తున్న మోటార్ సైకిల్ వాహనం ఢీ కొట్టింది. ఈ సంఘటన ఈ నెల 26వ తేదీన సాయంత్రం చోటుచేసుకుంది. కాగా చికిత్స పొందుతూ చందన శుక్రవారం మృతి చెందింది. కేసు నమోదు చేసుకుని విచారణ చేపడుతున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు