Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsక్రీడలుజిల్లా వార్తలునల్గొండ

క్రీడల అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్న ప్రజా ప్రభుత్వం.. ఎమ్మెల్యే బాలు నాయక్..!

క్రీడల అభివృద్ధికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందని దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ అన్నారు.

క్రీడల అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్న ప్రజా ప్రభుత్వం.. ఎమ్మెల్యే బాలు నాయక్..!

చింతపల్లి, మన సాక్షి :

క్రీడల అభివృద్ధికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందని దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ అన్నారు. శుక్రవారం చింతపల్లి మండలం మొద్గుల మల్లేపల్లి గ్రామంలో శ్రీరామ నవమి పర్వదినాన్ని పురస్కరించుకొని నిర్వహిస్తున్న క్రికెట్ టోర్నమెంట్ పోటీలను ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్ ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ క్రీడలు మానసిక ఉల్లాసానికి దోహదపడడంతోపాటు ,
గ్రామీణ స్థాయిలో క్రీడలను ప్రోత్సహించడం ఎంతో అవసరమని, క్రీడలు యువతలో క్రమశిక్షణ, ఐక్యత, నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తాయని పేర్కొన్నారు. ఇలాంటి టోర్నమెంట్‌ల ద్వారా గ్రామీణ యువతకు తమ ప్రతిభను ప్రదర్శించే మంచి వేదిక లభిస్తుందని, ప్రభుత్వం కూడా క్రీడల అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండి క్రీడలపై దృష్టి సారించాలని సూచించారు.

అలాగే శ్రీరామ నవమి పర్వదినం మన సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అని, శ్రీరాముని ఆదర్శాలను ప్రతి ఒక్కరూ జీవితంలో ఆచరించాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా టోర్నమెంట్‌లో పాల్గొంటున్న జట్లకు శుభాకాంక్షలు తెలియజేసి, క్రీడాస్ఫూర్తితో పోటీలు నిర్వహించాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ముద్దం మల్లేష్ గౌడ్ మల్లేష్, మాజీ ఎంపీపీ కొండూరు భవాని పవన్ కుమార్, మండల కాంగ్రెస్ పార్టీఅధ్యక్షులు అంగిరేకుల నాగభూషణం, ముచర్ల యాదగిరి , ఎరుకల వెంకటయ్య గౌడ్, సమ్మిడి రవిశంకర్ రెడ్డి, మాజీ జెడ్పిటిసి జటావత్ హరి నాయక్ జంగిటి నర్సింహా యాదవ్, మండల నాయకులు, గ్రామ పెద్దలు, యువకులు, క్రీడాకారులు తదితరులు ఈ కార్యక్రమలో పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు