Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలునల్గొండపండుగలు

గొడకొండ్ల లో ఘనంగా రథోత్సవం..!

తెలంగాణ రాష్ట్రంలో దేవాలయాల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రజా పాలన ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందని దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్ అన్నారు.

గొడకొండ్ల లో ఘనంగా రథోత్సవం..!

దేవాలయాల అభివృద్ధికి ప్రభుత్వం పెద్ద పీట.. ఎమ్మెల్యే బాలు నాయక్

చింతపల్లి, మనసాక్షి :

తెలంగాణ రాష్ట్రంలో దేవాలయాల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రజా పాలన ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందని దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్ అన్నారు. శనివారం చింతపల్లి మండల పరిధిలోని గొడకొండ్ల గ్రామంలో శ్రీరామనవమి పరవదినాన్ని పురస్కరించుకొని శ్రీ వేణుగోపాల స్వామి, ఆంజనేయ స్వామి వారి బ్రహ్మోత్సవ కార్యక్రమాల లో భాగంగా నేడు రథోత్సవ కార్యక్రమాని కి ముఖ్యఅతిథిగా విచ్చేసిన దేవరకొండ ఎమ్మెల్యే బాల నాయక్ గుడిలో ప్రత్యేక పూజ లు నిర్వహించి స్వామివారి రథోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా భక్తులను ఉద్దేశించి వారు మాట్లాడుతూగొడకొండ్ల గ్రామంలోగత 600 సంవత్సరాల క్రితం నెలకొల్పబడిన శ్రీ వేణుగోపాల స్వామి దేవాలయం దాతల సహకారంతో దిన దినాభివృద్ధి చెందుతూ వేలాది మంది భక్తుల నడుమ బ్రహ్మోత్సవ కార్యక్రమాలు జరుపుకోవడం ఎంతో హర్షించదగ్గ విషయం అన్నారు. యువకులు ఎంతో ఉత్సాహంగా బ్రహ్మోత్సవ కార్యక్రమాలు నిర్వహించడం భక్తి భావానికి నిదర్శనం అన్నారు.

ఈ దేవాలయ అభివృద్ధికి తన వంతు సహాయ సహకారాలు ఎప్పుడూ ఉంటాయి అన్నారు. అనంతరం ఆలయ కమిటీ నిర్వాహకులు ఎమ్మెల్యే బాలు నాయకును ఘనంగా సన్మానించారు . ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ అల్వాల జంగయ్య, స్థానిక సర్పంచ్ కాశ గోని వెంకటయ్య, ఉప సర్పంచ్ ఎండి ఖలీల్ ,మాజీ ఎంపీపీ కొండూరు భవాని పవన్ కుమార్, ఉత్సవ కమిటీ సభ్యులు, ఆలయ కమిటీ డైరెక్టర్లు వార్డు సభ్యులు , గ్రామ పెద్దలు భక్తులు,తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు