తెలంగాణBreaking Newsజిల్లా వార్తలునల్గొండ

మిర్యాలగూడ : అమావాస్య, వేప చెట్టు కింద మంత్రించిన కొబ్బరికాయలు, భయాందోళనలు.. రంగంలోకి జన విజ్ఞాన వేదిక..!

మిర్యాలగూడ : అమావాస్య, వేప చెట్టు కింద మంత్రించిన కొబ్బరికాయలు, భయాందోళనలు.. రంగంలోకి జన విజ్ఞాన వేదిక..!

మిర్యాలగూడ, మన సాక్షి:

నల్గొండ జిల్లా మిర్యాలగూడలో కాలనీవాసులు భయాందోళనకు గురవుతున్నారు. అమావాస్య రోజు ఓ వేప చెట్టు కింద కొబ్బరికాయలు ఉండడంతో మంత్రించినవి అని ఆ కాలనీవాసులు భయాందోళనలకు గురవుతున్నారు. దాంతో జనవిజ్ఞాన వేదిక కమిటీ రంగంలోకి వచ్చి ప్రజల భయాందోళనలు తొలగించింది.

వివరాల ప్రకారం.. మిర్యాలగూడలోని ఒక రెసిడెన్షియల్ కాలనీలో గత అమావాస్య నాడు ఒక వేప చెట్టు కింద కొన్ని కొబ్బరికాయలను గుర్తు తెలియని వ్యక్తి ఉంచాడని, అవి మంత్రించిన కొబ్బరికాయలని అక్కడి కాలనీవాసులు భయందోలను గురయ్యారు. విషయం తెలుసుకున్న జన విజ్ఞాన వేదిక నాయకులు అట్టి ప్రదేశానికి వెళ్లి ఆ కొబ్బరికాయలు పగలగొట్టి అక్కడే వాటిని తిని, ఇటువంటి చర్యల పట్ల ఆందోళన చెందొద్దని అక్కడి వారికి అవగాహన కల్పించారు.

ప్రభుత్వాలు కూడా మన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుతూనే, ఇటువంటి మంత్ర,తంత్రాల దుస్పలితాలు తెలియజేస్తూ, ఇట్టి బయాoదోళనకు గురిచేసేవారిని శిక్షించాలని కోరారు. అనంతరం అక్కడి కొబ్బరి కాయలను అక్కడే పగులగొట్టి అందరూ తినడం జరిగింది.

ఆధునిక ప్రపంచంలో మానవుడు శాస్త్ర సాంకేతిక పరంగా ఎంతో అభివృద్ధి చెందుతున్నప్పటికీ బాణామతి, చేతబడులు, మానవతీత శక్తులంటూ, మంత్రాలు, తంత్రాలు అంటూ వారి అపనమ్మకాలను, వేరే వారిపై రుద్దటడానికి ప్రయత్నం చేసే క్రమంలో అందరిని భయభ్రాంతులకు గురుచేస్తుండటం తీవ్రమైన చర్యలుగా పరిగణించాలని జన విజ్ఞాన వేదిక నాయకులు కోలా శ్రీనివాస్, పాదురి రమణారెడ్డి, సైన్స్ ప్రచార సంస్థ బక్క శ్రీనివాస్ చారి అన్నారు.

ఈ కార్యక్రమంలో జన విజ్ఞాన వేదిక జిల్లా మాజీ అధ్యక్షులు గుత్తికొండ సుదర్శన్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి అమరయ్య, శ్రీనివాస్ రెడ్డి, ఉదయ కుమారి, రేణుక, రామయ్య, తదితరులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి : 

Viral News : ఏడవ తరగతి కుర్రాడి లీవ్ లెటర్.. చదివితే పొట్ట చెక్కలయ్యేలా నవ్వాల్సిందే..!

Ration Cards : రేషన్ కార్డులపై సంచలన నిర్ణయం.. ఇవీ అర్హతలు..!

Cm Revanth Reddy : బతుకమ్మకు బహుమతి.. చీరలు బంద్..!

Miryalaguda : మిర్యాలగూడలో ట్రాఫిక్ ఆంక్షలు.. ఆ రోజు వాహనదారులు అటువైపు వెళ్లొద్దు..!

మరిన్ని వార్తలు