Miryalaguda : NSP క్యాంపులో ధన బలంతో వచ్చే వారికి ఓటుతో సమాధానం ఇవ్వండి..!
మున్సిపల్ ఎన్నికల్లో ధన బలంతో వచ్చేవారికి ఓటుతో సమాధానం ఇవ్వాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి రంగారెడ్డి కోరారు. శుక్రవారం స్థానిక 41వ క్యాంప్ వార్డ్ నందు ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

Miryalaguda : NSP క్యాంపులో ధన బలంతో వచ్చే వారికి ఓటుతో సమాధానం ఇవ్వండి..!
మిర్యాలగూడ, మన సాక్షి:
మున్సిపల్ ఎన్నికల్లో ధన బలంతో వచ్చేవారికి ఓటుతో సమాధానం ఇవ్వాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి రంగారెడ్డి కోరారు. శుక్రవారం స్థానిక 41వ క్యాంప్ వార్డ్ నందు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంలో బీఆర్ఎస్ నాయకులు సిద్ధార్థ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ఎన్నికల్లో ప్రజలకు మాట ఇచ్చి తప్పిన అధికార పార్టీకి చెందిన వారికి ఓటుతో బుద్ధి చెప్పాలని వారు కోరారు.
స్థానిక క్యాంపులో నివసిస్తున్న నాటి నాగార్జునసాగర్ ప్రాజెక్టు నిర్మాణంలో పనిచేసిన వారికి ఇవ్వాలని గత ప్రభుత్వంతో మాట్లాడి ఇప్పించామని వారు గుర్తు చేశారు. అధికార పార్టీ వ్యక్తులు ధనాన్ని సూపి ఓట్లు పొందాలని చూస్తున్నారని వారి ప్రలోభాలకు క్యాంపు లోని ప్రజలు లొంగరని ఆయన తెలిపారు.
అధికారులను కాంగ్రెస్ పార్టీ ఇప్పటివరకు పేద ప్రజలకు ఇల్లు ఇవ్వలేదని షాదీ ముబారక్ ఎవరికి అందలేదని అలాగే గత ఎన్నికల్లో వాగ్దానం చేసిన విధంగా తులం బంగారం ఎవరికి ఇవ్వలేదని విమర్శించారు. కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలో నున్న కాంగ్రెస్ పార్టీ పెట్టుబడిదారులకు స్థలం కొడుతున్నాయని వారి విమర్శించారు.
ఎన్నికల కార్యాలయం ప్రారంభించిన అనంతరం క్యాంపులో ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు రామ్మూర్తి, దేశి రామ్, సోమయ్య, నజీర్, రాజరత్నం, రాధ, బీఆర్ఎస్ నాయకులు శివ, రవీందర్, చంటి, క్రాంతి, లక్ష్మమ్మ తదితరులు పాల్గొన్నారు.









