Miryalaguda : మిర్యాలగూడ చైర్మన్ పీఠం.. ఆ నలుగురిలో వారికే..!
మున్సిపల్ ఎన్నికల్లో నల్గొండ జిల్లా మిర్యాలగూడలో కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాలు కైవసం చేసుకుంది. మిర్యాలగూడ మున్సిపల్ పీఠం కాంగ్రెస్ పార్టీ దక్కించుకుంది. స్థానిక శాసనసభ్యులు అనేక ఎత్తులు వేసి కాంగ్రెస్ పార్టీలో అత్యధిక కౌన్సిలర్ స్థానాలను సొంతం చేసుకున్నారు.

Miryalaguda : మిర్యాలగూడ చైర్మన్ పీఠం.. ఆ నలుగురిలో వారికే..!
మిర్యాలగూడ, మన సాక్షి :
మున్సిపల్ ఎన్నికల్లో నల్గొండ జిల్లా మిర్యాలగూడలో కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాలు కైవసం చేసుకుంది. మిర్యాలగూడ మున్సిపల్ పీఠం కాంగ్రెస్ పార్టీ దక్కించుకుంది. స్థానిక శాసనసభ్యులు అనేక ఎత్తులు వేసి కాంగ్రెస్ పార్టీలో అత్యధిక కౌన్సిలర్ స్థానాలను సొంతం చేసుకున్నారు. మొత్తం 48 వార్డులకు గాను 31 వార్డుల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. 14 వార్డులలో బీఆర్ఎస్, ఒక వార్డులో బిజెపి, ఇద్దరు ఇతరులు విజయం సాధించారు.
16న చైర్మన్ ఎన్నిక :
ఎన్నికల కమిషన్ ఆదేశాల ప్రకారం ఈనెల 16వ తేదీన మున్సిపల్ చైర్మన్ ఎన్నిక చేపట్టాల్సి ఉంది. అత్యధిక స్థానాలు గెలుపొందిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చైర్మన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కానీ ఎన్నికలకు ముందు చైర్మన్ అభ్యర్థిని ప్రకటించక పోవడంతో ఆస్థానం కోసం పలువురు పోటీలో ఉన్నట్లు తెలుస్తోంది.
ఆ నలుగురు లో ఎవరు..?
మునిసిపల్ చైర్మన్ పీఠంపై ఆ నలుగురు గురి పెట్టారు. ఎంతో కాలంగా పార్టీ అభ్యున్నతి కోసం పనిచేస్తూ పార్టీని అధికారంలోకి తీసుకురావడంలో కృషిచేసిన కార్యకర్తలుగా నాయకులుగా పని చేసి చైర్మన్ పీఠంపై గురి పెట్టారు. మిర్యాలగూడ చైర్మన్ పీఠం జనరల్ మహిళలకు రిజర్వు కావడంతో నలుగురు మహిళలు చైర్మన్ పీఠం కోసం పోటీల్లో ఉన్నట్లు సమాచారం.
కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు నూకల వేణుగోపాల్ రెడ్డి.. సతీమణి నూకల కవిత విజయం సాధించి చైర్మన్ రేస్ లో ఉన్నారు. ఆమె ప్రభుత్వ ఉద్యోగానికి సైతం రాజీనామా చేసి ఎన్నికల బరిలో నిలిచింది. చైర్మన్ పీఠం దక్కించుకునే ప్రయత్నంలో ఉన్నారు.
అదేవిధంగా జిల్లా కాంగ్రెస్ కార్యదర్శి చిలుకూరి బాలకృష్ణ ఆయన సతీమణి చిలుకూరి సుధ ను చైర్మన్ పీఠం కోసం ఎన్నికల్లో పోటీ చేయించారు. ఎన్నికల్లో విజయం సాధించిన చిలుకూరి సుధకు చైర్మన్ పీఠం కోసం ఆయన ప్రయత్నం చేస్తున్నారు.
అదేవిధంగా యువజన కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు మిట్టపల్లి వెంకటేష్.. ఆయన తల్లి మిట్టపల్లి సరిత ను చైర్మన్ పీఠం కోసమే రాజకీయాల్లోకి పోటీ చేయించినట్లు తెలుస్తుంది. మున్సిపల్ చైర్మన్ పీఠం దక్కించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
వ్యాపారవేత్త గుడిపాటి నవీన్ ఆయన సతీమణిని చైర్మన్ పీఠం కోసమే ఎన్నికల్లో పోటీ చేయించినట్లు తెలుస్తోంది. ఆ నలుగురిలో ఎవరితో ఒకరికి చైర్మన్ పీఠం దక్కే అవకాశాలు ఉన్నాయి.
అధిష్టానం ఫైనల్ :
చైర్మన్ పీఠం కోసం నలుగురు పోటీలో ఉండటంతో అధిష్టానం నిర్ణయమే ఫైనల్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. స్థానిక శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ శంకర్ నాయక్ తోపాటు ఎంపీ రఘువీర్ రెడ్డి అండదండలతో చైర్మన్ పీఠం దక్కించుకుంటేనే సహకారం ఉంటుందని భావిస్తున్నారు. పార్టీ అధిష్టానం అండదండలు ఎవరికి ఉంటే వారే చైర్మన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. పార్టీ అధిష్టానం నిర్ణయం మేరకు చైర్మన్ పీఠం దక్కించుకునే అవకాశం ఎవరికీ ఉందో లేచి చూడాల్సి ఉంది.









