నల్గొండBreaking Newsజిల్లా వార్తలువిద్య

Miryalaguda : మిర్యాలగూడలోని సెయింట్ జాన్స్ హై స్కూల్లో విద్యార్థులకు ఘనంగా వీడ్కోలు..!

విద్యార్థులు దృడ సంకల్పంతో ఉన్నత లక్ష్యాన్ని చేరుకోవాలని మండల విద్యాధికారి ధర్మనాయక్ అన్నారు. ఆదివారం మిర్యాలగూడలోని సెయింట్ జాన్స్ హై స్కూల్లో పదవ తరగతి విద్యార్థులకు వీడ్కోలు సమావేశం నిర్వహించారు.

Miryalaguda : మిర్యాలగూడలోని సెయింట్ జాన్స్ హై స్కూల్లో విద్యార్థులకు ఘనంగా వీడ్కోలు..!

మిర్యాలగూడ, మన సాక్షి :

విద్యార్థులు దృడ సంకల్పంతో ఉన్నత లక్ష్యాన్ని చేరుకోవాలని మండల విద్యాధికారి ధర్మనాయక్ అన్నారు. ఆదివారం మిర్యాలగూడలోని సెయింట్ జాన్స్ హై స్కూల్లో పదవ తరగతి విద్యార్థులకు వీడ్కోలు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాఠశాల విద్యను పూర్తి చేసుకుని ఉన్నత చదువులకు వెళ్తున్న విద్యార్థుల అందరికీ శుభాకాంక్షలు తెలిపారు.

పాఠశాల ప్రిన్సిపల్ అలుగుబెల్లి శ్రీనివాసరెడ్డి, కరస్పాండెంట్ అలుగుబెల్లి శిరీష మాట్లాడుతూ పాఠశాల విద్యలో విద్యార్థులు చక్కగా రాణించారని, ఉన్నత లక్ష్యాలను ఎంచుకొని దృఢ సంకల్పంతో ఆ లక్ష్యాలను చేరుకోవాలని దీవించారు. ఈ సందర్భంగా విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.

కార్యక్రమంలో బకల్ వాడ ఉన్నత పాఠశాల గెజిటెడ్ హెడ్మాస్టర్ అలుగుబెల్లి కరుణాకర్ రెడ్డి, తోపుచర్ల హై స్కూల్ గెజిటెడ్ హెడ్మాస్టర్ అలుగుబెల్లి అరుణ కుమారి, వేములపల్లి ఉన్నత పాఠశాల గెజిటెడ్ హెడ్మాస్టర్ రమేష్, అన్నారం ఉన్నత పాఠశాల గెజిటెడ్ హెడ్మాస్టర్ గోపి తదితరులు పాల్గొన్నారు.

MOST READ 

  1. Penpahad : నాగులపహాడ్ త్రికుటేశ్వరాలయంలో పోటెత్తిన భక్తులు..!

  2. CM Revanth Reddy : కవితకు షాక్.. సీఎం ను కలిసిన ఫార్వార్డ్ బ్లాక్ కౌన్సిలర్లు.. (వీడియో)

  3. Municipal Elections : తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాల అధికారిక ప్రకటన.. ఎవరికి ఎంత శాతం వార్డులు..!

  4. Nalgonda : నల్లగొండ కార్పొరేషన్ పై ఎగిరిన కాంగ్రెస్ జెండా.. ఏ డివిజన్ లో గెలిచింది ఎవరు..!

మరిన్ని వార్తలు