MIRYALAGUDA : మిర్యాలగూడలో గంజాయి గ్యాంగ్ అరెస్ట్..!
MIRYALAGUDA : మిర్యాలగూడలో గంజాయి గ్యాంగ్ అరెస్ట్..!
మిర్యాలగూడ , మన సాక్షి :
గత కొంతకాలంగా మిర్యాలగూడలో గంజాయి సరఫరా చేస్తున్న, వినియోగిస్తున్న గ్యాంగ్ ను పోలీసులు అరెస్టు చేశారు. మంగళవారం మిర్యాలగూడ డి.ఎస్.పి రాజశేఖర్ రాజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పూర్తి వివరాలు వెల్లడించారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రైల్వే స్టేషన్ చెట్ల పొదలలో కొంతమంది గంజాయి అమ్మడం, కొనడం చేస్తున్న విషయాన్ని తెలుసుకొని దాడులు నిర్వహించి పట్టుకున్నట్లు తెలిపారు.
పట్టుబడిన వారిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పల్నాడు జిల్లా మాచర్ల కు చెందిన నాగరాజు, మంజుల లక్ష్మి, దుర్గారావు అనేవారు ఒరిస్సా నుండి గుర్తుతెలియని వ్యక్తుల నుంచి తక్కువ ధరకు గంజాయిని కొనుగోలు చేస్తారు. వీరు లాభం చూసుకొని మిర్యాలగూడ చెందిన షేక్ సమీర్, సిరిపాటి రవీందర్, దుద్దుడుకు అంజి, చెలిమండ్ల సుభాష్, ధీరావత్ ఉపేందర్, మీసాల ప్రవీణ్ కుమార్, తరుణ్, లైటింగ్ సమీర్, శివాజీ, తో పాటు బీహార్ కు చెందిన యాదాద్రి పవర్ ప్లాంట్ లో పనిచేసే లాలూ కుమార్ యాదవ్ వ్యక్తులకు విక్రయిస్తారు.
కాగా వీరంతా కొనుగోలు చేసిన గంజాయిని కొంత వాడుకొని చిన్నచిన్న ప్యాకెట్లుగా చేసి కావలసిన వారికి విక్రయిస్తుంటారు. అదే విధంగా సోమవారం సాయంత్రం మాచర్ల నుండి శివనాగరాజు, మంజుల లక్ష్మీలు గంజాయిని తీసుకొని మిర్యాలగూడ రైల్వే స్టేషన్ వద్ద షేక్ సమీర్, సిరిపాటి రవీందర్, దుద్దుడుకు అంజి, చెలిమండ్ల సుభాష్, దిరావత్ ఉపేందర్, మీసాల ప్రవీణ్ కుమార్, తో పాటు బీహార్ కు చెందిన లాలు కుమార్ యాదవులకు ఒక్కొక్కరికి 100 గ్రాములు చొప్పున విక్రయించారు.
ఆ క్రమంలో పోలీసులు వారిని పట్టుకుని అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 1.95 కేజీల ఎండు గంజాయి, ఐదు సెల్ ఫోన్లు, 3500 రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నట్లు డిఎస్పీ తెలిపారు. గంజాయి విలువ సుమారుగా 26000 ఉంటుందని ఆయన పేర్కొన్నారు.
మిర్యాలగూడ రూరల్ సిఐ వీరబాబు, రూరల్ ఎస్సై నరేష్, వాడపల్లి ఎస్సై రవి, వేములపల్లి ఎస్సై విజయ్ కుమార్, సిబ్బంది ఏఎస్ఐ లు యాదగిరి, రాములు, ఉమాపతిరావు, కానిస్టేబుల్స్ ప్రభాకర్ రెడ్డి, కొమ్ము రవి, సైదా నాయక్, శ్రీను, శ్రీనివాస్ రెడ్డి, శ్రీను నాయక్, వెంకటేశ్వర్లు, ఉషా, హోంగార్డులు గోపి, జానీ, రమణ, సైదయ్య, మురళి లు కలిసి నేరస్తులను పట్టుకున్నట్లు తెలిపారు.
ALSO READ :
Cm Revanth Reddy: రైతులకు బిగ్ రిలీఫ్.. రూ.1350 కోట్లతో ఆ పథకం.. సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన..!









