జిల్లా వార్తలుBreaking Newsనల్గొండవిద్య
Miryalaguda : మిర్యాలగూడలోని శిష్య పాఠశాలలో ఘనంగా గ్రాడ్యుయేషన్ డే..!
నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని చైతన్య నగర్ లో ఉన్న శిష్య పాఠశాలలో గ్రాడ్యుయేషన్ డే, వార్షిక దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శిష్య పాఠశాల ప్రిన్సిపల్ అలుగుబెల్లి శ్రీనివాస్ రెడ్డి, కరస్పాండెంట్ అలుగుబెల్లి శిరీష మాట్లాడుతూ పాఠశాలలో నిర్వహిస్తున్న సాంస్కృతిక, విద్యా, వైజ్ఞానిక కార్యక్రమాలు విద్యార్థులను ప్రతిభను మెరుగుపరుచుతాయన్నారు.

మన సాక్షి, మిర్యాలగూడ :

అందుకుగాను పాఠశాలలో బతుకమ్మ, సంక్రాంతి, సైన్స్ డే, మ్యాథ్స్ డే కూడా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. విద్యార్థులకు గుడ్ బిహేవియర్, స్పోకెన్ ఇంగ్లీష్, బెస్ట్ ర్యాంకర్స్ కు మెమెంటోలు సర్టిఫికెట్లు అందజేశారు. కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.