TOP STORIESBreaking Newsజిల్లా వార్తలునల్గొండరాజకీయం

Miryalaguda : మిర్యాలగూడ మార్కెట్ కమిటీకి వేళాయె.. రాష్ట్రవ్యాప్తంగా 113 పూర్తి..!

Miryalaguda : మిర్యాలగూడ మార్కెట్ కమిటీకి వేళాయె.. రాష్ట్రవ్యాప్తంగా 113 పూర్తి..!

మిర్యాలగూడ, మన సాక్షి :

నల్గొండ జిల్లాలోనే అతిపెద్ద వ్యవసాయ మార్కెట్ మిర్యాలగూడలో ఉన్నది. కానీ ఆ మార్కెట్ కు సీజన్ వచ్చినా కూడా ఒక్క బస్తా ధాన్యం కూడా రాదు. ఒకప్పుడు లక్షల క్వింటాళ్ల ధాన్యంతో సీజన్ లో కిటకిటలాడిన మార్కెట్ యార్డ్ ఇప్పుడు వేలవేలబోతోంది.

రైతులు ఆయకట్టు పరిధిలో ఎక్కువగా సన్నధాన్యాన్ని పండిస్తారు. పండించిన ధాన్యాన్ని నేరుగా రైస్ మిల్లులకు విక్రయించుకుంటున్నారు. అంతేకాకుండా ఐకెపి కేంద్రాలలో ధాన్యం హెక్రయించుకుంటున్నారు. దాంతో మిర్యాలగూడ వ్యవసాయ మార్కెట్ కు ధాన్యం రాక వెలవెలబోతోంది.

11 మాసాలైనా చైర్మన్ పదవి..?

మార్కెట్ కమిటీ నామినేటెడ్ పదవులను భర్తీ చేయకపోవడంతో నాయకులు ఎదురుచూస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 113 మార్కెట్ కమిటీల నామినేటెడ్ పదవులను నియమించారు. కానీ మిర్యాలగూడ మార్కెట్ కమిటీ మాత్రం నియమించలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 11 మాసాలు గడుస్తుంది. అయినా కూడా నామినేటెడ్ లో భర్తీ చేయాల్సిన పదవి ఇప్పటివరకు భర్తీ కాలేదు.

మిర్యాలగూడ వ్యవసాయ మార్కెట్ చైర్మన్ పదవి జనరల్ మహిళలకు రిజర్వేషన్ కేటాయించారు. కాగా ఆశావహులు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పెద్దలతో తీవ్ర ప్రయత్నాలు సాగిస్తున్నారు. అయినా కూడా ఇప్పటివరకు నియామకం జరగలేదు. పార్లమెంట్ ఎన్నికల అనంతరం మిర్యాలగూడ మార్కెట్ కమిటీ చైర్మన్ నామినేటెడ్ పదవిని భర్తీ చేస్తారని ఊహాగానాలు వచ్చినప్పటికీ ఇప్పటివరకు నియమించలేదు.

సీనియర్లు , జూనియర్ల మద్య వర్గ విభేదాలు :

మిర్యాలగూడ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవిని నియమించే విషయంలో సీనియర్లు, జూనియర్లు అనే వివాదం నెలకొన్నట్లు సమాచారం. కాంగ్రెస్ పార్టీలో మొదటి నుంచి ఉన్నవారికి మార్కెట్ కమిటీ పదవి కేటాయించాలని ఒక వర్గం ప్రయత్నాలు కొనసాగిస్తుండగా మరో వర్గం తామే పార్టీ గెలుపుకు కృషి చేశామంటూ వారి ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు.

ఏది ఏమైనా సీనియర్లు జూనియర్ల మధ్య వర్గ విభేదాలు ఉన్న కారణంగా ప్రభుత్వం ఏర్పడి 11 మాసాలైనప్పటికీ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవిని నియమించలేకపోయారు. మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి కేవలం ఏడాది మాత్రమే ఉంటుంది.

ప్రభుత్వం ఏర్పడిన వెంటనే చైర్మన్ నామినేటెడ్ నియమిస్తే మరో మాసం అయితే ఒకరిది గడువు కూడా ముగిసేది అంటూ పార్టీలో చర్చ సాగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా 113 మార్కెట్ కమిటీలు పూర్తి కావడంతో మిర్యాలగూడ మార్కెట్ కమిటీ కూడా త్వరలో పూర్తికానున్నదని ఆశావహులు ఎదురుచూస్తున్నారు.

MOST READ : 

మరిన్ని వార్తలు