Miryalaguda : మిర్యాలగూడ వాసికి నందమూరి స్వర్ణ నంది పురస్కారం..!
Miryalaguda : మిర్యాలగూడ వాసికి నందమూరి స్వర్ణ నంది పురస్కారం..!
మిర్యాలగూడ, మన సాక్షి:
నల్గొండ జిల్లా మిర్యాలగూడ కు చెందిన నటుడు, నిర్మాత, సామాజికవేత్త మూస అలీ ఖాన్ నందమూరి తారక రామారావు స్వర్ణ నంది పురస్కారం అందుకున్నారు.
తెలుగు విశ్వ విద్యాలయం నాంపల్లి హైదరాబాద్ లో నిర్వహించిన నందమూరి స్వర్ణ నంది పురస్కార కార్యక్రమంలో
పూర్వ కేంద్ర మంత్రి వర్యులు డాక్టర్ యస్.వేణుగోపాలాచారి. ఆం.ప్ర.ప్రభుత్వ.పూర్వ.చీఫ్.విప్.యం.యల్.సి.రుద్రరాజుపద్మరాజు, జహీరాబాద్ మాతాజీ చేతుల మీదుగా పురస్కారం అందుకోవడం జరిగింది.
ఈ కార్యక్రమాన్ని శిఖరం ఆర్ట్ థియేటర్స్ కృష్ణ గొల్ల ఘనంగా నిర్వహించారు. మూసా ఆలీ ఖాన్ మాట్లాడుతూ నందమూరి తారక రామారావు స్వర్ణ నంది పురస్కారం అందుకోవడం గర్వంగా భావిస్తూ భవిష్యత్తులో నటుడుగా, నిర్మాత గా, సమాజానికి ఉపయోగపడే మంచి కార్యక్రమాలు చేస్తూ అందరి మన్ననలు పొందాలని నన్ను వెన్నంటి ప్రోత్సహిస్తున్న ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా మరియు సినిమా జర్నలిస్టులకు నాతోటి సినీ కళాకారులకు హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు.
ALSO READ :










