Miryalaguda : పట్టాలు తప్పిన గూడ్స్ రైలు..!

నల్గొండ జిల్లా మిర్యాలగూడ నియోజకవర్గంలోని దామరచర్ల మండలం విష్ణుపురం రైల్వే స్టేషన్ వద్ద గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. గుంటూరు నుంచి సికింద్రాబాద్ వైపు వెళ్తున్న గూడ్స్ రైలు విష్ణుపురం రైల్వే స్టేషన్ వద్ద ప్రధాన పట్టాలపై నుంచి పక్కకు ఒరిగింది.

Miryalaguda : పట్టాలు తప్పిన గూడ్స్ రైలు..!

మిర్యాలగూడ , మన సాక్షి :

నల్గొండ జిల్లా మిర్యాలగూడ నియోజకవర్గంలోని దామరచర్ల మండలం విష్ణుపురం రైల్వే స్టేషన్ వద్ద గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. గుంటూరు నుంచి సికింద్రాబాద్ వైపు వెళ్తున్న గూడ్స్ రైలు విష్ణుపురం రైల్వే స్టేషన్ వద్ద ప్రధాన పట్టాలపై నుంచి పక్కకు ఒరిగింది.

దానివల్ల రెండు బోగీలు పట్టాల నుంచి తప్పిపోయాయి. గూడ్స్ రైలు అతివేగంగా ఉండడంతో ఈ ప్రమాదం జరిగింది. కానీ భారీ ప్రమాదం తప్పింది. రైలు పట్టాలు తప్పిన సమయంలో మిగతా బోగీలు కూడా పడిపోకుండా డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించారు.

గుంటూరు సికింద్రాబాద్ మార్గంలో పలు రైళ్లకు అంతరాయం ఏర్పడింది. శబరి ఎక్స్ప్రెస్ ను మిర్యాలగూడ వద్ద, జన్మభూమి ఎక్స్ప్రెస్ ను పల్నాడు జిల్లా పిడుగురాళ్ల వద్ద నిలిపివేశారు. సంఘటనా స్థలానికి చేరుకున్న రైల్వే అధికారులు పునరుద్ధరణ చర్యలు చేపట్టారు.

MOST READ : 

Prabhas : ప్రభాస్ కు పెళ్లి వేళయ్యిందా.. చేసుకోబోయేది ఆ హీరోయిన్నేనా..?

డిగ్రీ చేసి ఖాళీగా ఉన్నారా..? అయితే ఈ జాబ్ ఛాన్స్.. మిస్ కాకండి..!

WhatsApp : వాట్సాప్ లో రెండు కొత్త ఫీచర్లు.. ఎలా ఉపయోగించాలో తెలుసుకోండి..!