Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsటెక్నాలజీతెలంగాణ

WhatsApp : వాట్సాప్ లో రెండు కొత్త ఫీచర్లు.. ఎలా ఉపయోగించాలో తెలుసుకోండి..!

WhatsApp : వాట్సాప్ లో రెండు కొత్త ఫీచర్లు.. ఎలా ఉపయోగించాలో తెలుసుకోండి..!

మన సాక్షి , ఫీచర్స్ :

సమాచారం చేరవేసేందుకు అతిపెద్ద ప్లాట్ ఫారమ్ వాట్సప్. కొత్త కొత్త ఫీచర్లను జోడించి వినియోగదారులకు అందిస్తుంది. ఇప్పుడు వాట్సప్ మరో రెండు కొత్త ఫీచర్లను విడుదల చేస్తుంది. వాటిలో మొదటి ఫీచర్ వాట్స్అప్ లో యాప్ లో కెమెరాను ఉపయోగిస్తున్నప్పుడు జూమ్ చేయడానికి సులభతరం చేస్తుంది.

రెండవ ఫీచర్ వినియోగదారులు కెమెరా రోల్ నుండి కొత్త స్టిక్కర్స్ ను త్వరగా సృష్టించుకోవడానికి లేదా కొత్త సత్వర మార్గాల ద్వారా స్టిక్కర్లను రూపొందించుకోవడానికి అనుమతిస్తుంది. ఈ రెండు ఫీచర్లు ఐఓఎస్, ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్లలో వినియోగదారులందరికీ కూడా త్వరలోనే అందుబాటులోకి రానున్నాయి.

వాట్సప్ ఫీచర్ ట్రాకర్ వాట్సాప్ బీటాల్లో కొత్త జూమ్ కంట్రోల్ ఫీచర్ ను గుర్తించింది. టెస్ట్ ఫైట్ ద్వారా ఐఓఎస్ కోసం వాట్సాప్ బీటా వర్ష న్ లను స్వీకరించడానికి సైనాప్ చేసిన వినియోగదారులు కొత్త కెమెరా జూమ్ కంట్రోల్ బటన్ ను యాక్సెస్ చేయడానికి తాజా వెర్షన్ కి అప్డేట్ చేయవచ్చును.

ఈ ఫీచర్ వాట్స్అప్ లో ఫోటోలను క్లిక్ చేసేటప్పుడు లేదా వీడియోలను రికార్డు చేసేటప్పుడు వివిధ జూమ్ ఆప్షన్ల మధ్య మారడానికి వీలు కల్పిస్తుంది. వాట్సప్ ప్రస్తుతం యాప్ లోని కెమెరాను ఉపయోగిస్తున్నప్పుడు వ్యూ ఫైండర్ లో పించ్ ఇన్ మరియు అవుట్ చేయడానికి లేదా క్యాప్షర్ బటన్ నొక్కి పట్టుకొని పైకి స్వైప్ చేయడానికి వినియోగదారులను అనుమతిస్తుంది. ఇది భవిష్యత్తులో వినియోగదారులు అందరికీ కూడా అందుబాటులోకి వస్తుంది.

MOST READ : 

WhatsApp : ఇండియాలో వాట్సాప్ సేవలు నిలిచిపోనున్నాయా.. కారణం ఏంటి..?

WhatsApp : వాట్సాప్ లో అదిరిపోయే ఫీచర్.. ఈవెంట్ ప్లాన్ చేయొచ్చు..!

World Laughing Day : మే 5 ప్రపంచ నవ్వుల దినోత్సవం.. ఎందుకు, ఎప్పటినుంచి జరుపుకుంటున్నామో తెలుసా..!

Work From Home : వర్క్ ఫ్రం హోం ఉద్యోగం కావాలా..? లక్షల జీతం.. ఇలా పొందండి..!

Gas Stove : ఇంట్లో గ్యాస్ స్టవ్ మూడు బర్నర్ ఉంటే మంచిదా..? కాదా..?

మరిన్ని వార్తలు