BREAKING : నల్గొండ డిటిసి ఆఫీసులో ఏసీబీ ఆకస్మిక తనిఖీలు. ఏజెంట్ల ద్వారా పనులు చేయీస్తున్న అధికారులు..!

నల్గొండ జిల్లా కేంద్రంలోని డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కార్యాలయంలో అనేక అవకతవకలు అక్రమాలు జరుగుతున్నాయి. అన్న ఫిర్యాదులపై రాష్ట్ర డిజిపి ఆదేశాల మేరకు మంగళవారం నల్లగొండ ఏసీబీ డిఎస్పి జగదీష్ చందర్ డిటిసి కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. తనిఖీ సమయంలో లైసెన్సులు ఆర్సిలు తదితర పనుల కోసం వచ్చిన వారిని వివరాలు అడిగి తెలుసుకున్నారు.

BREAKING : నల్గొండ డిటిసి ఆఫీసులో ఏసీబీ ఆకస్మిక తనిఖీలు. ఏజెంట్ల ద్వారా పనులు చేయీస్తున్న అధికారులు..!

నల్లగొండ, మనసాక్షి.

నల్గొండ జిల్లా కేంద్రంలోని డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కార్యాలయంలో అనేక అవకతవకలు అక్రమాలు జరుగుతున్నాయి. అన్న ఫిర్యాదులపై రాష్ట్ర డిజిపి ఆదేశాల మేరకు మంగళవారం నల్లగొండ ఏసీబీ డిఎస్పి జగదీష్ చందర్ డిటిసి కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. తనిఖీ సమయంలో లైసెన్సులు ఆర్సిలు తదితర పనుల కోసం వచ్చిన వారిని వివరాలు అడిగి తెలుసుకున్నారు.

ఇదే సందర్భంలో అనుమతులు లేకుండా డిటిసి కార్యాలయంలో కార్యాలయం అధికారుల అనుమతితో వివిధ సర్టిఫికెట్ల కోసం వచ్చిన ఆరుగురు ఏజెంట్లను పట్టుకొని విచారించగా వారు ప్రజల నుండి డబ్బులు వసూలు చేస్తూ అక్రమాలకు పాల్పడుతూ ప్రజలను మోసం చేస్తున్నారని తెలుసుకున్నారు . వారి వద్ద నుండి రికార్డులను, కొంత నగదును స్వాధీనం చేసుకొని మరింత లోతుగా విచారిస్తున్నారు.

కార్యాలయంలోని వివిధ విభాగాలలో తనిఖీలు జరుగుతున్నాయని ఎసిబి డిఎస్పి జగదీష్ చందర్ తెలిపారు . ప్రభుత్వ అధికారులు లంచం అడిగితే ఇవ్వకుండా 10 64 టోల్ ఫ్రీ నెంబర్ కు ఫిర్యాదు చేయాలని వివరాలు గోప్యంగా ఉంచుతామని తెలిపారు. విచారణ అనంతరం డిటిసి కార్యాలయంలో దోషులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు .ఈ ఆకస్మికతనిఖీలో డిఎస్పిఎస్సిబి జగదీష్ చందర్ ఆధ్వర్యంలో సిఐలు రామారావు వెంకటేశ్వరరావు 12 మంది ఏసీబీ సిబ్బంది పాల్గొన్నారు.

ALSO READ : 

Nalgonda : నల్గొండ జిల్లాలో మోటార్ సైకిల్ దొంగతనాలకు పాల్పడుచున్న అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్టు..!

BREAKING : మిర్యాలగూడలో నకిలీ పత్తి విత్తన వ్యాపారుల అరెస్ట్, రిమాండ్..!