Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణనల్గొండవ్యవసాయం

BREAKING : మిర్యాలగూడలో నకిలీ పత్తి విత్తన వ్యాపారుల అరెస్ట్, రిమాండ్..!

BREAKING : మిర్యాలగూడలో నకిలీ పత్తి విత్తన వ్యాపారుల అరెస్ట్, రిమాండ్..!

మిర్యాలగూడ,  మన  సాక్షి:

నకిలీ పత్తి విత్తనాలను విక్రయించే వ్యాపార ముఠా సభ్యులను సోమవారం అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు మిర్యాలగూడ డీఎస్పీ రాజశేఖర్ రాజు తెలిపారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీఎస్పీ కేసు వివరాలను వెల్లడించారు.

మిర్యాలగూడ పట్టణంలోని ఈదులగూడ చౌరస్తా వద్ద ఈ నెల 25వ తేదీన వన్ టౌన్ పోలీసులు సాధారణ తనిఖీలు చేపట్టారు. ఇదే సమయంలో ఓ వ్యక్తి కొన్ని విత్తన బస్తాలతో పాటు చేతి సంచిని వదిలేసి వెళ్లినట్లు చెప్పారు. వెంటనే అగ్రికల్చర్ ఆఫీసర్ కు సమాచారం అందించగా వాటిని పరిశీలించిన అగ్రికల్చర్ అధికారి సరిత నకిలీ పత్తి విత్తనాలుగా తేల్చారని చెప్పారు.

ఆమె ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించగా ఆధార్ కార్డు ఆధారంగా మిర్యాలగూడ రైల్వే స్టేషన్ వద్ద గంధ వళ్ల శ్రీరంగాను అదుపులోకి తీసుకొని విచారించినట్లు తెలిపారు. మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం సారంగపల్లి కి చెందిన గునుగుంట్ల వీర మణికంఠ అలియాస్ అయ్యప్ప, ముండ్రు మల్లికార్జున్ అలియాస్ అనీల్ చౌదరి, ఇదే జిల్లా పరిధిలోని ఎర్రగుంటపల్లి కోటా సాంబశివరావు నకిలీ పత్తి విత్తనాల వ్యాపారులను కలిసేందుకు వాడపల్లి చెక్ పోస్ట్ వద్ధ ఉన్నట్లు విచారణలో తేలగా నిందితుల నుంచి 260 క్వింటాళ్ల నకిలీ పత్తి విత్తనాలతో పాటు 250 గ్రాముల నకిలీ పత్తి విత్తన ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు.

మొత్తం నలుగురు నిండితులను అరెస్టు చేసి రిమాండ్ చేసినట్లు తెలిపారు. ప్రకాశం జిల్లా పొంగులూరు మండలం చదలవాడకు చెందిన పెండ్యాల జగదీశ్వరరావు వద్ధ సదరు నిందితులు నకిలీ పత్తి విత్తనాలను కొనుగోలు చేస్తున్నట్లు చెప్పారు. కాగా ప్రధాన నిందితుడైన జగదీశ్వరరావు పరారీలో ఉండగా ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ఈ సమావేశంలో వన్ టౌన్ సీఐ సుధాకర్, ఎస్ఐ రవి, వెంకటేశ్వర్లు, హుస్సేన్, నాగరాజు, నరసింహ, తమిజుద్ధీన్ ఉన్నారు.

ALSO READ : 

Nalgonda : నల్గొండ జిల్లాలో మోటార్ సైకిల్ దొంగతనాలకు పాల్పడుచున్న అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్టు..!

మరిన్ని వార్తలు