Nalgonda : నల్గొండ జిల్లాలో మోటార్ సైకిల్ దొంగతనాలకు పాల్పడుచున్న అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్టు..!

గత కొంత కాలం నుండి తెలంగాణ రాష్ట్రం లో నల్లగొండ, తిప్పర్తి, మిర్యాలగూడ, నార్కెట్ పల్లి, నకిరేకల్, సూర్యాపేట, భువనగిరి, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం లోని పిడుగురాళ్ల, దాచేపల్లి, చిలకలూరిపేట, యెడ్ల పాడు, మంగళగిరి, గుంటూరు ప్రాంతాల్లో బుల్లెట్ మరియు పల్సర్ మోటార్ సైకిళ్ళు దొంగతనాలకు పాల్పడుతున్న ఐదుగురి అంతర్రాష్ట్ర దొంగల ముఠాను అరెస్ట్ చేసినట్లు జిల్లా ఎస్పీ చందన దీప్తి తెలిపారు. 

Nalgonda : నల్గొండ జిల్లాలో మోటార్ సైకిల్ దొంగతనాలకు పాల్పడుచున్న అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్టు..!

నల్లగొండ  ,మనసాక్షి

గత కొంత కాలం నుండి తెలంగాణ రాష్ట్రం లో నల్లగొండ, తిప్పర్తి, మిర్యాలగూడ, నార్కెట్ పల్లి, నకిరేకల్, సూర్యాపేట, భువనగిరి, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం లోని పిడుగురాళ్ల, దాచేపల్లి, చిలకలూరిపేట, యెడ్ల పాడు, మంగళగిరి, గుంటూరు ప్రాంతాల్లో బుల్లెట్ మరియు పల్సర్ మోటార్ సైకిళ్ళు దొంగతనాలకు పాల్పడుతున్న ఐదుగురి అంతర్రాష్ట్ర దొంగల ముఠాను అరెస్ట్ చేసినట్లు జిల్లా ఎస్పీ చందన దీప్తి తెలిపారు.

.సోమవారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ .పోలీసులకు సవాలు గా మారిన ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకొని నల్గొండ డి.ఎస్.పి శివరాం రెడ్డి పర్యవేక్షణ లో నల్గొండ-2 టౌన్ సర్కిల్ సీఐ డానియెల్ కుమార్ ఆధ్వర్యం లో నల్గొండ-2 టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్సై నాగరాజు హెడ్ కానిస్టేబుల్ విష్ణువర్ధన్ గిరి, కానిస్టేబుల్ లు బాలకోటి, లింగస్వామి, మహేశ్ లు మంగళవారం అరెస్టు చేసి వారి వద్ధ నుండి రూ.90 లక్షల విలువైన 20 బుల్లెట్ మోటార్ సైకిళ్ళు 47 పల్సర్ మోటార్ సైకిళ్ళు మొత్తం 67 బైకులు స్వాధీనము చేసుకుని కేసును చేదించారని ఎస్పీ తెలిపారు.

ALSO READ : IPL- 2024 : సన్ రైజర్స్ ప్లాప్ షో.. కె కె ఆర్ మూడోసారి కప్ కైవసం..!

ఈనెల 26వ తేదీన పానగల్ బైపాస్ వద్ద వాహనాలను తనిఖీ చేస్తుండగా నేరస్తులు అనుమానాస్పదంగా కనిపించడంతో నల్గొండ టూ టౌన్ పోలీసులు పట్టుకొని విచారించగా బైకుల దొంగతనం చేస్తున్నట్లు తెలిసింది అన్నారు . చిలకలూరిపేటకు చెందిన తుప్పకుల వెంకటేష్ ప్రకాశం జిల్లా కు చెందిన గువ్వల శబరిష్ పల్నాడు జిల్లా చిలకలూరిపేటకు చెందిన గుంజి అంకమ్మరావు ఇదే జిల్లా పిడుగురాళ్ల కు చెందిన మెట్టుపల్లి శ్రీకాంత్ లను ఆవుల వేణులను అరెస్టు చేసినట్లు తెలిపారు.

ALSO READ : IPL 2024 : కంటతడి పెట్టిన కావ్య మారన్..!

వీరంతా రద్దీగా ఉన్న ప్రదేశాలలో అలాగే ఇంటిముందు పార్కింగ్ చేస్తున్న బైకులను రెక్కీ నిర్వహించి ఎవరికి అనుమానం రాకుండా నేరాలు చేస్తారని తెలిపారు. నేరస్తుడు తుపాకుల వెంకటేష్ బైక్ హ్యాండిల్ లాకులను విరగొట్టి బ్యాటరీ వైర్లను కలిపి బైకులో స్టార్ట్ చేసి దొంగలిస్తాడని తెలిపారు. నెంబర్ మార్చి రంగు మార్చి పోలీసులకు దొరకకుండా బైకులను ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో సొంత బైక్ అని చెప్పి అమ్ముతారని తెలిపారు. వచ్చిన డబ్బును సమానంగా పంచుకుంటారని తెలిపారు  నేరస్తుల నుండి స్వాదీనం చేసుకున్న మొత్తం విలువ 90 లక్షల వరకు ఉంటుందని ఎస్పీ తెలిపారు.

నేరస్థులను అరెస్టు చేసి, బైక్ లను స్వాదీనం చేసుకోవడం లో ప్రతిభ కనబరచిన పోలీస్ అధికారులైన
శ్శివరాం రెడ్డి, డి.ఎస్.పి నల్గొండ, .డానియెల్ కుమార్ నల్గొండ-II టౌన్ సర్కిల్ సిఐ నాగరాజు, ఎస్‌ఐ నల్గొండ-2టౌన్, విష్ణువర్ధన్ గిరి హెడ్ కానిస్టేబుల్, నల్గొండ-2 టౌన్ కానిస్టేబుల్ లు బాలకోటి, లింగస్వామి, . మహేశ్ లను జిల్లా ఎస్పీ అభినందించారు.