IPL- 2024 : సన్ రైజర్స్ ప్లాప్ షో.. కె కె ఆర్ మూడోసారి కప్ కైవసం..!

ఐపీఎల్ 20 24 లో లీగ్ దశ నుంచే అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన కోల్ కతా నైట్ రైడర్స్ క్రీడాకారులు ఫైనల్లో కూడా అదే ప్రతిభను చాటారు. ఐపీఎల్ కప్ కైవసం చేసుకున్నారు. ఫైనల్ మ్యాచ్లో సన్రైజర్స్ పై 8 వికెట్ల తేడాతో నైట్ రైడర్స్ విజయం సాధించారు.

IPL- 2024 : సన్ రైజర్స్ ప్లాప్ షో.. కె కె ఆర్ మూడోసారి కప్ కైవసం..!

చెన్నై , మన సాక్షి :

ఐపీఎల్ 20 24 లో లీగ్ దశ నుంచే అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన కోల్ కతా నైట్ రైడర్స్ క్రీడాకారులు ఫైనల్లో కూడా అదే ప్రతిభను చాటారు. ఐపీఎల్ కప్ కైవసం చేసుకున్నారు. ఫైనల్ మ్యాచ్లో సన్రైజర్స్ పై 8 వికెట్ల తేడాతో నైట్ రైడర్స్ విజయం సాధించారు. ఫైనల్ మ్యాచ్ లో సన్రైజర్స్ చిత్తుగా ఓడిపోయింది.

బౌలింగ్ లోను అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన కేకేఆర్ క్రీడాకారులు బ్యాటింగ్ లోను ఉతికి పారేశారు. సన్రైజర్స్ క్రీడాకారులు బ్యాటింగ్ లోను బౌలింగ్ లోను పేలవంగా ఆడి అభిమానులకు చేదు అనుభవాన్ని మిగిల్చారు. టాస్ గెలిచి సన్రైజర్స్ జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. ముందుగా బ్యాటింగ్ చేసిన సన్రైజర్స్ జట్టు 18.3 ఓవర్లలో 113 పరుగులకే ఆల్ అవుట్ అయింది. కమీన్స్( 24) మార్కమ్ (20) మాత్రమే ఓ మాదిరిగా ఆడారు.

మిగతా ప్లేయర్లంతా చతికిల పడిపోయారు. ఆ తర్వాత బ్యాటింగ్ చేసిన నైట్ రైడర్స్ 10.3 ఓవర్లలోనే రెండు వికెట్ల నష్టానికి 114 పరుగులు చేసి కప్ కైవసం చేసుకున్నారు.

కంటతడి పెట్టిన కావ్య:

ఐపిఎల్ 2024 సీజన్ లో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు అసాధారణ ప్రతిభ కనబరిచింది. లీగ్ దశలో టాప్ లో ఉన్న సన్రైజర్స్ ప్లే ఆప్స్ వచ్చేవరకు కాస్త తగ్గింది. అతి కష్టం మీద ఫైనల్ కు చేరింది. ఎన్నో రికార్డులను సొంతం చేసుకుంది. సన్రైజర్స్ అసాధారణ ప్రతిభ క్రీడాభిమానులను ఎంతో ఉత్తేజపరిచింది. ఐపీ ఎల్ 2024 సన్రైజర్స్ గెలుచుకుంటుందని ఎంతోమంది ఎదురు చూశారు.

కానీ ఊహించని విధంగా పేలవంగా ఫైనల్ లో ఆడి చిత్తుగా ఓడిపోవడంతో సన్రైజర్స్ ఓనర్ కావ్య మారన్ తట్టుకోలేకపోయింది. కీలక పోరులో కనీసం పోటీ కూడా ఇవ్వలేకపోవడంతో ఆమె దుఃఖాన్ని ఆపుకోలేక కంటతడి పెట్టింది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్ గా మారింది. ఓటమి తట్టుకోలేక కావ్య మారన్ కన్నీటి పర్యంతమైనది.

ఈ వీడియో చూసిన సన్రైజర్స్ హైదరాబాద్ అభిమానులు తల్లడిల్లీ పోతున్నారు. సన్రైజర్స్ క్రీడాకారులు కీలక పోరులో స్థాయికి తగ్గ ప్రదర్శన కూడా చేయకపోవడాన్ని తీవ్రంగా విమర్శిస్తున్నారు.

మూడోసారి కప్ కైవసం :

ఐపిఎల్ లో కేకేఆర్ జట్టు మూడోసారి చేసుకుంది. 20 24 లో మొదటి నుంచి అత్యంత ప్రతిభ కనబరిచిన కేకేఆర్ చివరి వరకు అదే ఊపుతో ఆడి కప్పును సొంతం చేసుకుంది. 2012లో కూడా ఇదే స్టేడియంలో కేకేఆర్ తొలిసారిగా కైవసం చేసుకోవడం విశేషం. పిచ్ ఎలా ఉన్నా.. అతి సునాయాసంగా ఎలాంటి టెన్షన్ లేకుండా కేకేఆర్ జట్టు ఆడి కప్ ను కైవసం చేసుకుంది.

ఫైనల్ మ్యాచ్లో నరాలు తెగే ఉత్కంఠ ఉంటుందని క్రీడాకారులు భావించినప్పటికీ సన్రైజర్స్ జట్టు బ్యాటింగ్ మొదలుపెట్టిన కొద్దిసేపటికే తేలిపోయింది. సన్రైజర్స్ పేలవంగా బ్యాటింగ్ చేయడం క్రీడాకారులను సన్రైజర్స్ అభిమానులను నిరాశ కలిగించింది. దాంతో చేదన కోసం బ్యాటింగ్ చేసిన కేకేఆర్ అతి సునాయాసంగా చేదించి కప్ కైవసం చేసుకుంది.

ALSO READ : 

IPL : నేడు ఐపీఎల్ SRH – KKR తొలి క్వాలిఫైయర్ మ్యాచ్.. వర్షం వస్తే ఎలా..!

IPL : నేడు ఐపీఎల్ SRH – KKR తొలి క్వాలిఫైయర్ మ్యాచ్.. వర్షం వస్తే ఎలా..!

IPL 2024 – RCB ప్లే ఆప్స్ కు వెళ్తుందా.. వెళ్లాలంటే ఏం చేయాలి, అభిమానుల్లో ఉత్కంఠ..!

IPL : ముంబై కి బై బై.. ఆ ఛాంపియన్ ఇక ఏ జట్టుకు వెళ్తాడో..?