IPL 2024 – RCB ప్లే ఆప్స్ కు వెళ్తుందా.. వెళ్లాలంటే ఏం చేయాలి, అభిమానుల్లో ఉత్కంఠ..!

IPL 2024 - ఐపీఎల్ ఈ సీజన్ అభిమానులకు ఉత్కంఠతను కలిగిస్తుంది. ఈ సీజన్ లో మంచి పేరున్న జట్లు వెనకబడిపోగా అవి త్వరలోనే నిష్క్రమించాయి. అంచనాలు లేని జట్లు ముందు వరుసలో నిలబడి ప్లే యాప్స్ కు అర్హత సాధిస్తున్నాయి.

IPL 2024 – RCB ప్లే ఆప్స్ కు వెళ్తుందా.. వెళ్లాలంటే ఏం చేయాలి, అభిమానుల్లో ఉత్కంఠ..!

మన సాక్షి స్పోర్ట్స్ డెస్క్:

IPL 2024 – ఐపీఎల్ ఈ సీజన్ అభిమానులకు ఉత్కంఠతను కలిగిస్తుంది. ఈ సీజన్ లో మంచి పేరున్న జట్లు వెనకబడిపోగా అవి త్వరలోనే నిష్క్రమించాయి. అంచనాలు లేని జట్లు ముందు వరుసలో నిలబడి ప్లే యాప్స్ కు అర్హత సాధిస్తున్నాయి. ఐపీఎల్ 17వ సీజన్ ప్రారంభమైన నాటి నుంచే ఉత్కంఠతగా మ్యాచ్లు సాగుతున్నాయి. అయితే ఈ సీజన్ లో కోల్ కతా జట్టును విశ్లేషకులు పెద్దగా లెక్కల్లోకి తీసుకోలేదు.

అయినా అది ఏకంగా ప్లే ఆప్స్ కు వెళ్ళిపోయింది. ఇక రాజస్థాన్ కూడా అదే పరిస్థితిలో ఉంది. హైదరాబాద్ జట్టు కూడా ప్లాప్స్ వెళ్లే మార్గంలోనే ఉంది. ఇక మొదటి నుంచి బెంగళూరు (RCB )జట్టు ఓటమిలను చవిచూసి ఆ తర్వాత ప్లే ఆప్స్ కు వెళ్లే దశలో దూకుడు పెంచింది. పాయింట్ల పట్టికలో ఆర్సిబి ఐదవ స్థానంలో ఉంది. ప్లే యాప్స్ కు ఆశలు సజీవంగా నిలుపుకుంది.

ఎస్ ఆర్ హెచ్ ఇప్పటివరకు 12 మ్యాచులు ఆడగా ఏడు మ్యాచ్లలో విజయం సాధించింది. మరో రెండు మ్యాచ్ లు ఆడాల్సి ఉంది. గుజరాత్, పంజాబ్ జట్టుతో జరిగే మ్యాచ్లలో గెలిస్తే ప్లే అప్స్ కు వెళుతుంది. ఒకవేళ ఒక మ్యాచ్లో గెలిచి రెండో మ్యాచ్లో ఓడిపోతే ఇతర జట్ల ఫలితాలపై రన్ రేట్ ప్రకారం ఆధారపడి ఉండాల్సి ఉంటుంది.

ఇటీవల లక్నో జట్టుపై 10 వికెట్ల తేడాతో విజయం సాధించిన హైదరాబాద్ జట్టు పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి వెళ్లిపోయింది. అయితే చెన్నై జట్టు రాజస్థాన్ పై విజయం సాధించడంతో రన్ రేట్ కారణంగా చెన్నై మూడో స్థానానికి వెళ్లిపోగా హైదరాబాద్ జట్టు నాలుగో స్థానంకు చేరుకుంది. ఇక హైదరాబాద్ జట్టు ప్రస్తుతం ఫామ్ లో ఉన్నందున గుజరాత్ , పంజాబ్ జట్లపై విజయం సాధించి ప్లే ఆప్స్ చేరుకుంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

ఇది ఇలా ఉండగా ఇక ఆర్సిబి విషయానికి వస్తే ఇప్పటివరకు 13 మ్యాచ్ లు ఆడింది. ఆరింట్లో విజయం సాధించింది. ప్లే ఆప్స్ మీద కూడా గంపెడాశలు పెట్టుకుంది. మొదట్లో వరుస ఓటమి పాలైన ఆర్సిబి ఇప్పుడు వరుస విజయాలు సాధిస్తుంది. బెంగళూరు అభిమానులు మాత్రం అర్ సి బి కి కప్ వస్తుందని భావిస్తున్నారు. సోషల్ మీడియాలో కూడా ఆర్సిబి జట్టుపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

ఇప్పుడు ఆర్సిబి ప్లే ఆప్స్ కి వెళ్లాలంటే హైదరాబాద్, లక్నో, ఢిల్లీ జట్లు టోర్నీ నుంచి నిష్క్రమించాలి. అంతేకాకుండా చెన్నై జట్టుతో తలపడే మ్యాచ్ లో బెంగళూరు 18 పరుగుల తేడాతో విజయం దక్కించుకోవాలి. అది సాధ్యం కాకుంటే చెన్నై విధించిన లక్ష్యాన్ని 18 ఓవర్లలో చేదించాల్సి ఉంటుంది. అలా అయితేనే బెంగళూరు ప్లే ఆప్స్ కు వెళ్లే అవకాశం ఉంది.

ALSO READ :

ఏళ్ల తరబడి తండ్రి మృతదేహం ఇంట్లోనే.. ఎందుకు దాచిందో తెలిస్తే షాక్..!

డిగ్రీ చేసి ఖాళీగా ఉన్నారా..? అయితే ఈ జాబ్ ఛాన్స్.. మిస్ కాకండి..!

SRH : ఎస్ ఆర్ హెచ్ కు బిగ్ షాక్.. ఇండియా వదిలి వెళ్లిపోయిన కామిన్స్, హెడ్..!

Polling : రబ్బర్ బుల్లెట్లు, రాళ్లదాడుల నడుమ.. తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన పోలింగ్..!

Polling : రబ్బర్ బుల్లెట్లు, రాళ్లదాడుల నడుమ.. తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన పోలింగ్..!