ఏళ్ల తరబడి తండ్రి మృతదేహం ఇంట్లోనే.. ఎందుకు దాచిందో తెలిస్తే షాక్..!

ఓ మహిళ తన తండ్రి మృతదేహాన్ని సంవత్సరాల పాటు ఇంట్లోనే దాచింది. చనిపోయిన వ్యక్తికి దహన సంస్కారాలు చేయటం ఆచారం. కానీ ఆమె మాత్రం తన తండ్రి మృతదేహాన్ని ఇంట్లోనే దాచింది.

ఏళ్ల తరబడి తండ్రి మృతదేహం ఇంట్లోనే.. ఎందుకు దాచిందో తెలిస్తే షాక్..!

మన సాక్షి , వెబ్ డిస్క్ :

ఓ మహిళ తన తండ్రి మృతదేహాన్ని సంవత్సరాల పాటు ఇంట్లోనే దాచింది. చనిపోయిన వ్యక్తికి దహన సంస్కారాలు చేయటం ఆచారం. కానీ ఆమె మాత్రం తన తండ్రి మృతదేహాన్ని ఇంట్లోనే దాచింది. ఈ సంఘటన తైవాన్ దేశంలో వెలుగు చూసింది. కూతురు చేసిన నిర్వాకానికి అందరూ ఆశ్చర్యపోయారు. వివరాల ప్రకారం..

ఆమె తండ్రి సైన్యంలో 20 సంవత్సరాల పాటు వివిధ హోదాలలో పనిచేశారు. ఆయన సర్వీసును బట్టి నెలకు 1.27 లక్షల రూపాయల పెన్షన్ వస్తుంది. పెన్షన్ మాత్రం ప్రతినెల డ్రా అవుతుంది. కానీ అతను మాత్రం కనిపించడం లేదు. ఆ సమయంలో కుమార్తె తీరు అనుమానం కలిగింది. డెంగీ నివారణ చర్యల్లో భాగంగా ఇంటికి వచ్చిన వైద్యాధికారులను ఇంట్లోకి వెళ్లకుండా అడ్డుకున్నది. దాంతో వారికి అనుమానం వచ్చింది ఇంట్లోకి రానివ్వకపోవడంతో ఆమెకు 1.5 లక్షల రూపాయల జరిమానా కూడా విధించారు.

అయినా కూడా ఆమె ఇంట్లోకి రానివ్వకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేయగా వాళ్ళు రంగప్రవేశం చేశారు. ఆమె ఇంటిని సోదా చేసేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. దాంతో ఆమె తండ్రి ఆచూకీ కోసం విచారించగా తొలత ఆమె సొంత నర్సింగ్ హోమ్ లో ఉన్నట్లు బుకాయించింది. పోలీసులు అడిగే మరి కొన్ని ప్రశ్నలకు వేరే నగరంలో ఉన్న తన సోదరుడు వద్ద తన తండ్రి ఉన్నాడని చెప్పింది.

తన సోదరుడి వివరాలు తెలుసుకునే వరకు ఆయన చాలా సంవత్సరాల క్రితమే చనిపోయినట్లు తేలింది. తండ్రి చనిపోయాడని డెత్ సర్టిఫికెట్ తీసుకోలేదని తెలిపింది. చాలా అనేక కథలు చెబుతూనే ఇంట్లో సోదాలు జరిపే వారికి ఓ ప్లాస్టిక్ బ్యాగ్ లో మానవ ఎముకలు గుర్తించారు. ఆ ఎముకలను పరిశీలించిన అధికారులు రెండు సంవత్సరాల క్రితమే చనిపోయి ఉన్నట్లుగా భావిస్తున్నారు. ఆమె తండ్రి మృతికి కారణాలు తెలియలేదు. కానీ ఆమె మాత్రం తన తండ్రి కి నెలకు వచ్చే పింఛన్ కోసమే ఇలా చేసినట్లు చివరికి తెలిసింది.

ALSO READ : 

Telangana : ఓటు వేసేందుకు స్వగ్రామం వెళ్ళిన కేసీఆర్ కు ఏం జరిగిందో తెలుసుకోవాలని ఉందా..?

SRH : ఎస్ ఆర్ హెచ్ కు బిగ్ షాక్.. ఇండియా వదిలి వెళ్లిపోయిన కామిన్స్, హెడ్..!

Nalgonda : క్యూలో నిల్చోని నల్గొండ జిల్లా కలెక్టర్.. ఓటు హక్కు వినియోగించుకున్న ప్రముఖులు..!

WhatsApp : వాట్సాప్ లో రెండు కొత్త ఫీచర్లు.. ఎలా ఉపయోగించాలో తెలుసుకోండి..!

Gas Stove : ఇంట్లో గ్యాస్ స్టవ్ మూడు బర్నర్ ఉంటే మంచిదా..? కాదా..?

Work From Home : వర్క్ ఫ్రం హోం ఉద్యోగం కావాలా..? లక్షల జీతం.. ఇలా పొందండి..!