Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండరాజకీయంసూర్యాపేట జిల్లా

Nalgonda : క్యూలో నిల్చోని నల్గొండ జిల్లా కలెక్టర్.. ఓటు హక్కు వినియోగించుకున్న ప్రముఖులు..!

Nalgonda : క్యూలో నిల్చోని నల్గొండ జిల్లా కలెక్టర్.. ఓటు హక్కు వినియోగించుకున్న ప్రముఖులు..!

నల్గొండ, సూర్యాపేట, మన సాక్షి :

నల్గొండ జిల్లా కలెక్టర్ క్యూలో నిలిచి ఓటు హక్కు వినియోగించుకున్నారు. పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ సోమవారం జరుగుతుంది. నల్గొండ జిల్లాలో పలువురు ప్రముఖులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి కుటుంబ సభ్యులతో నల్లగొండలో ఓటు హక్కు వినియోగించుకోగా..

నల్గొండ జిల్లా కేంద్రంలోని 69 వ పోలింగ్ కేంద్రంలో జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి దాసరి హరిచందన ఓటు హక్కును వినియోగించుకున్నారు.

తెలంగాణ శాస‌న మండ‌లి చైర్మైన్ గుత్తా సుఖెంద‌ర్ రెడ్డి న‌ల్గొండ ప‌ట్ట‌ణంలో కుటుంబ స‌మెతంగా త‌న ఓటు హ‌క్కును వినియోగించుకున్నారు. నాగార్జున కాల‌నిలోని *ఎమ్. వి . ఆర్ హై స్కూల్* లో గుత్తా సుఖెంద‌ర్ రెడ్డి ఆయన సతీమణి గుత్తా అరుంధతి ,తనయుడు గుత్తా అమిత్ రెడ్డి ,కోడలు గుత్తా అఖిల రెడ్డి ఓటు హ‌క్కును వినియోగించుకున్నారు.

సూర్యాపేట జిల్లా కేంద్రంలో మాజీమంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి ఓటు హక్కును వినియోగించుకున్నారు.

చిట్యాల మండలం ఊరుమడ్లలో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కంచర్ల కృష్ణారెడ్డి ఓటు హక్కు వినియోగించుకున్నారు.

మిర్యాలగూడ పట్టణంలో శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు.

మిర్యాలగూడ పట్టణంలో మాజీ శాసనసభ్యులు నల్లమోతు భాస్కరరావు ఓటు హక్కు వినియోగించుకున్నారు.

రైస్ మిల్లర్స్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు కర్నాటి రమేష్ మిర్యాలగూడలో కుటుంబ సభ్యులతో ఓటు హక్కు వినియోగించుకున్నారు.

ALSO READ : 

Elections : నల్గొండ పార్లమెంట్ పోలింగ్ కు సర్వం సిద్ధం.. ఇవి పూర్తి వివరాలు..!

WhatsApp : వాట్సాప్ లో రెండు కొత్త ఫీచర్లు.. ఎలా ఉపయోగించాలో తెలుసుకోండి..!

Gas Stove : ఇంట్లో గ్యాస్ స్టవ్ మూడు బర్నర్ ఉంటే మంచిదా..? కాదా..?

Work From Home : వర్క్ ఫ్రం హోం ఉద్యోగం కావాలా..? లక్షల జీతం.. ఇలా పొందండి..!

 

మరిన్ని వార్తలు