Elections : నల్గొండ పార్లమెంట్ పోలింగ్ కు సర్వం సిద్ధం.. ఇవి పూర్తి వివరాలు..!

నల్లగొండ పార్లమెంట్ ఎన్నికలకు అధికార యంత్రంగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. నల్లగొండ పార్లమెంటు పరిధిలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలలో ఎన్నికల సామాగ్రిని కూడా పంపిణీ చేశారు ఈనెల 13వ తేదీన నిర్వహించే పోలింగ్ కు సర్వం సిద్ధం అయ్యింది.

Elections : నల్గొండ పార్లమెంట్ పోలింగ్ కు సర్వం సిద్ధం.. ఇవి పూర్తి వివరాలు..!

నల్లగొండ మన సాక్షి

నల్లగొండ పార్లమెంట్ ఎన్నికలకు అధికార యంత్రంగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. నల్లగొండ పార్లమెంటు పరిధిలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలలో ఎన్నికల సామాగ్రిని కూడా పంపిణీ చేశారు ఈనెల 13వ తేదీన నిర్వహించే పోలింగ్ కు సర్వం సిద్ధం అయ్యింది.

పార్లమెంటు ఎన్నికల వివరాలు:

నల్గొండ లోక్ సభ లో పురుషుల కంటే మహిళ ఓట్లే అధికం..

మహిళా 8,80,453, పురుషుల 844843 ఓటర్లు ఉన్నారు..

నల్గొండ పార్లమెంటు పరిధిలో మొత్తం 1725465 మంది ఓటర్లు..

నల్గొండ పార్లమెంట్ బరిలో 22 మంది అభ్యర్థులు..

పోలింగ్ సిబ్బందికి ఈవీఎంలు పంపిణీ..

నల్లగొండ పార్లమెంట్ లో మొత్తం 2061 పోలింగ్ కేంద్రాలు ఉండగా ఎన్నికల నిర్వహణ కోసం 2061 టీం లు ఏర్పాటు..

మరో 374 టీంలు రిజర్వు..

నల్గొండ పార్లమెంట్ పరిధిలో ఏడు డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ఏర్పాటు..

ఈవీఎం వాహనాలకు జిపిఆర్ఎస్..

నల్లగొండ ఎన్నికల నిర్వహణలో పోలీసులు భారీ బందోబస్తు..

2600 మంది సివిల్ పోలీసులు, 250 మంది శిక్షణ కానిస్టేబుల్స్, (600)ఏడు కంపెనీల కేంద్రబలగాలు..

నియోజకవర్గాల వారీగా ఓటర్ల వివరాలు :

నల్లగొండ నియోజకవర్గంలో పురుషులు 121303, మహిళలు 128052,ట్రాన్స్ జెండర్స్ 56 మంది ఉన్నారు. మొత్తం 249411 ఓటర్లు ఉన్నారు.

దేవరకొండ అసెంబ్లీ నియోజకవర్గంలో పురుషులు 131838,మహిళలు 130624,ట్రాన్స్ జెండర్స్ 18 మంది ఉన్నారు.మొత్తం 262480 ఓటర్లు.

నాగార్జునసాగర్ నియోజకవర్గంలో పురుషులు 115852,మహిళలు 120611,ట్రాన్స్ జెండర్స్ 21 మంది ఉన్నారు.మొత్తం 236484 ఓటర్లు..

మిర్యాలగూడ నియోజకవర్గంలో పురుషులు 115773,మహిళలు 120611, ట్రాన్స్ జెండర్స్ 26 ఉన్నారు.మొత్తం ఓటర్లు 236343.

హుజూర్ నగర్ నియోజకవర్గం పురుషులు 121956, మహిళలు 129471,ట్రాన్స్ జెండర్స్ 17 ఉన్నారు.మొత్తం 251444 ఓటర్లు..

కోదాడ నియోజకవర్గంలో పురుషులు 119172, మహిళలు 125997,ట్రాన్స్ జెండర్స్ 18 మంది ఉన్నారు.మొత్తం ఓటర్లు 245187.

సూర్యాపేట నియోజకవర్గంలో పురుషులు 118949,మహిళలు 125154,ట్రాన్స్ జెండర్స్ 13 మంది ఉన్నారు.మొత్తం ఓటర్లు 244116.

పోలింగ్ కేంద్రాలలో అన్ని సౌకర్యాల ఏర్పాటు

ఓటర్లందరూ నిర్భయంగా, స్వేచ్ఛగా పోలింగ్ కేంద్రాలకు వచ్చి ఓటు వేయాలి-

జిల్లా కలెక్టర్ ,జిల్లా ఎన్నికల అధికారి, నల్గొండ పార్లమెంటరీ నియోజకవర్గం రిటర్నింగ్ అధికారి దాసరి హరిచందన పిలుపు

నల్గొండ పార్లమెంట్ నియోజకర్గానికి సంబంధించి జిల్లా వ్యాప్తంగా 2061 పోలింగ్ కేంద్రాలలో ఏర్పాటీలన్నింటిని పూర్తిచేయడం జరిగిందని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి దాసరి హరిచందన తెలిపారు. ఆదివారం సాయంత్రం నాటికి పోలింగ్ బృందాలన్నీ సంబంధిత పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటాయని ఆమె వెల్లడించారు .ఆదివారం నల్గొండ పట్టణంలోని ఎన్జీ కళాశాలలో ఏర్పాటుచేసిన పార్లమెంటు ఎన్నికల పంపిణీ కేంద్రాన్ని ఆమె సందర్శించారు.

అక్కడ పోలింగ్ సిబ్బంది మెటీరియల్ పంపిణీ, పోలింగ్ కేంద్రాలకు తరలించే ఏర్పాట్లను, సిబ్బందికి భోజన, ఇతర సౌకర్యాలను తనిఖీ చేశారు అనంతరం మీడియాతో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఈ సంవత్సరం జిల్లాలో ఓటింగ్ శాతం పెంచేందుకు స్వీప్ కార్యక్రమాల ద్వారా ఓటర్లలో పెద్ద ఎత్తున అవగాహన చేపట్టడం జరిగిందని చెప్పారు.

వేసవిని దృష్టిలో ఉంచుకొని పోలింగ్ కేంద్రాలలో నీడ, తాగునీరు, టాయిలెట్స్ తోపాటు, మెడికల్ బృందాలను ఏర్పాటు చేయడం జరిగిందని, సెక్టోరల్ అధికారులతో పాటు, అంబులెన్స్ లు సైతం ఏర్పాటు చేశామని చెప్పారు. పోలింగ్ కేంద్రాలలో ఎలాంటి ఆ సౌకర్యాలు లేకుండా అన్ని సౌకర్యాలు కల్పించామని ,జిల్లాలోని ఓటర్లందరూ స్వేచ్ఛగా, నిర్భయంగా పోలింగ్ కేంద్రాలకు వచ్చి వారి ఓటు హక్కును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు.

ఈనెల 11వ తేదీ సాయంత్రం నుండి ఎన్నికల ప్రచారం ముగిసినందున ఎన్నికల ప్రవర్తనా నియమావళిని కట్టుదిట్టంగా అమలు చేసేందుకు 85 ఎఫ్ఎస్ టి, ఎస్ ఎస్ టి ,వి ఎస్ టి, వివి టి బృందాలు పర్యవేక్షణ చేస్తున్నాయని, ఎక్కడ ఎలాంటి సంఘటన జరగకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

సి- విజిల్ ద్వారా ఇప్పటివరకు 180 ఫిర్యాదులు రాగా, వాటన్నిటిని కేవలం 55 నిమిషాల లోపే బృందాలు ఆ ప్రదేశాలకు వెళ్లి పరిష్కరించడం జరిగిందని తెలిపారు. పోలింగ్ కు సర్వం సిద్ధంగా ఉన్నట్లు ఆమె తెలిపారు .
నల్గొండ ఆర్డీవో రవి రవికుమార్, డిఆర్డిఓ నాగిరెడ్డి తదితరులు ఉన్నారు.

MOST READ : 

WhatsApp : వాట్సాప్ లో రెండు కొత్త ఫీచర్లు.. ఎలా ఉపయోగించాలో తెలుసుకోండి..!

Gas Stove : ఇంట్లో గ్యాస్ స్టవ్ మూడు బర్నర్ ఉంటే మంచిదా..? కాదా..?

Work From Home : వర్క్ ఫ్రం హోం ఉద్యోగం కావాలా..? లక్షల జీతం.. ఇలా పొందండి..!