Telangana : ఓటు వేసేందుకు స్వగ్రామం వెళ్ళిన కేసీఆర్ కు ఏం జరిగిందో తెలుసుకోవాలని ఉందా..?

బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు వేసేందుకు తన స్వగ్రామమైన చింతమడకకు వెళ్లారు. అక్కడ పోలింగ్ బూత్ వద్ద ఏం జరిగిందో తెలుసుకోవాలని ఉందా..?

Telangana : ఓటు వేసేందుకు స్వగ్రామం వెళ్ళిన కేసీఆర్ కు ఏం జరిగిందో తెలుసుకోవాలని ఉందా..?

దుబ్బాక, మనసాక్షి :

బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు వేసేందుకు తన స్వగ్రామమైన చింతమడకకు వెళ్లారు. అక్కడ పోలింగ్ బూత్ వద్ద ఏం జరిగిందో తెలుసుకోవాలని ఉందా..?

చేతి కర్ర సహాయంతో ఆయన ఓటు వేసేందుకు పోలింగ్ బూత్ లోకి వెళ్లే సమయంలో అక్కడ ఉన్న ఓటర్లంతా కేసీఆర్ ను చూసేందుకు పోటీపడ్డారు. ఆయనకు చేతులెత్తి నమస్కారాలు పట్టడంతో పాటు సెల్ఫీలు సైతం దిగారు. ఆయన అందరికీ పేరుపేరునా నమస్కారం చెప్పి పోలింగ్ బూత్ లోకి వెళ్లి ఓటు వేశారు. కేసీఆర్ తన సతీమణి శోభ దంపతులు ఓటు హక్కును వినియోగించుకున్నారు.

మెదక్ బిజెపి పార్లమెంట్ అభ్యర్థి మాధవనేని రఘునందన్ రావు తన సొంత గ్రామమైన దుబ్బాక నియోజకవర్గంలోని బొప్పాపూర్ గ్రామంలో తన సతీమణి మంజుల లత తో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నారు.

మాజీమంత్రి తన్నీరు హరీష్ రావు తన కుటుంబ సమేతంగా సిద్దిపేట పట్టణంలోని 11వ పోలింగ్ బూత్ భరత్ నగర్ లో ని ఆంబిట్స్ పాఠశాలలో ఓటును వేశారు.

దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి తన సొంత గ్రామమైన దుబ్బాక మండలం పోతారం గ్రామంలో తన కుటుంబ సమేతంగా ఓటు హక్కు వినియోగించుకున్నారు.

దుబ్బాక కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి తన సొంత గ్రామం తుక్కాపూర్ లో ఓటు హక్కును వినియోగించుకున్నారు.

MOST READ : 

WhatsApp : వాట్సాప్ లో రెండు కొత్త ఫీచర్లు.. ఎలా ఉపయోగించాలో తెలుసుకోండి..!

SRH : ఎస్ ఆర్ హెచ్ కు బిగ్ షాక్.. ఇండియా వదిలి వెళ్లిపోయిన కామిన్స్, హెడ్..!

Work From Home : వర్క్ ఫ్రం హోం ఉద్యోగం కావాలా..? లక్షల జీతం.. ఇలా పొందండి..!

Gas Stove : ఇంట్లో గ్యాస్ స్టవ్ మూడు బర్నర్ ఉంటే మంచిదా..? కాదా..?