IPL : నేడు ఐపీఎల్ SRH – KKR తొలి క్వాలిఫైయర్ మ్యాచ్.. వర్షం వస్తే ఎలా..!

IPL 2024 : ఐపీఎల్ 20 24 చివరి దశకు చేరుకుంది. ఇప్పటివరకు 70 మ్యాచ్ లు విజయవంతంగా ముగిశాయి. మంగళవారంతో ప్లే ఆప్స్ ప్రారంభం కానున్నది. పాయింట్లు పట్టికలో నాలుగు స్థానాలలో నిలిచిన జట్లు ప్లే ఆప్స్ ఆడనున్నాయి.

IPL : నేడు ఐపీఎల్ SRH – KKR తొలి క్వాలిఫైయర్ మ్యాచ్.. వర్షం వస్తే ఎలా..!

మన సాక్షి , స్పోర్ట్స్ డెస్క్ :

IPL 2024 : ఐపీఎల్ 20 24 చివరి దశకు చేరుకుంది. ఇప్పటివరకు 70 మ్యాచ్ లు విజయవంతంగా ముగిశాయి. మంగళవారంతో ప్లే ఆప్స్ ప్రారంభం కానున్నది. పాయింట్లు పట్టికలో నాలుగు స్థానాలలో నిలిచిన జట్లు ప్లే ఆప్స్ ఆడనున్నాయి. వాటిలో కోలకతా నైట్ రైడర్స్ (KKR), సన్రైజర్స్ హైదరాబాద్ (SRH), రాజస్థాన్ రాయల్స్(RR) రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) ఉన్నాయి.

ప్లే ఆప్స్ లో ఉన్న కేకేఆర్, ఎస్ ఆర్ హెచ్ మంగళవారం తొలి క్వాలిఫైయర్ మ్యాచ్ ఆడనున్నాయి. బుధవారం జరిగే ఎలిమినేటర్ లో రాజస్థాన్ రాయల్స్ , ఆర్ సి బి తలపడనున్నాయి. ఈ రెండు మ్యాచ్ లకు అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియం ఆతిథ్యం ఇవ్వనున్నది.

అయితే గత 8 లీగ్ మ్యాచ్ లలో కూడా వర్షం కారణంతో రద్దయ్యాయి. కేకేఆర్ – రాజస్థాన్ రాయల్స్ మధ్య జరగాల్సిన చివరి మ్యాచ్ లు కూడా వర్షంతో రద్దయ్యాయి.

అదే విధంగా ప్లే ఆప్స్ మ్యాచ్ లు వర్షంతో రద్దు అయితే ఏం చేస్తారు..? అనే ప్రశ్న క్రికెట్ అభిమానులను వెంటాడుతుంది. ప్లే ఆప్స్ కు రిజర్వ్ డే ఉందా..? ఉంటే ఆరోజు కూడా వర్షం వచ్చి మ్యాచ్ జరగకపోతే ఏం చేస్తారు..? సూపర్ ఓవర్ టై అయితే ఏం చేస్తారు..? అనేది అభిమానులను కలవరపెడుతుంది.

 


ప్లే ఆప్స్ కు రిజర్వుడ్ డే :

ఐపీఎల్ -2024 సీజన్ లో నాలుగు ప్లే యాప్స్ మ్యాచ్ లకు రిజర్వ్ డేలు కేటాయించారు. షెడ్యూల్ తేదీలలో వర్షంతో మ్యాచ్ పెద్దయితే రిజర్వుడే రోజు పూర్తి మ్యాచ్ ఆడిస్తారు. అంతేకాకుండా ప్లే యాప్స్ మ్యాచ్ లో ఫలితాన్ని తేల్చేందుకు రెండు గంటల ఎక్స్ ట్రా టైం కూడా ఉంటుంది. సాధారణంగా లీగ్ మ్యాచ్ లలో ఈ టైం గంట మాత్రమే ఉండగా ప్లే ఆప్స్ లో రెండు గంటలు కేటాయించారు. ఓవర్లను కుదించి అయినా ఫలితాన్ని తేల్చే విధంగా ప్రయత్నం చేస్తారు. అప్పటికి కూడా మ్యాచ్ ఆడటం సాధ్యం కాకపోతే రిజర్వుడే పూర్తి మ్యాచ్ని ఆడిస్తారు.

రిజర్వుడే కూడా వర్షం వస్తే :

రిజర్వుడే కూడా వర్షం వస్తే ఫలితం ఎలా తేల్చుతారు..? అనేది ప్రశ్నార్థకంగా మారింది. రిజర్వుడే కూడా వర్షం.. కానీ ఇతర కారణాల వల్ల మ్యాచ్ రద్దు అయితే పాయింట్లు టేబుల్ ప్రకారం విజేతను నిర్ణయిస్తారు. హైదరాబాద్ – కేకేఆర్ మ్యాచ్ రిజర్వుడే కూడా వర్షం వచ్చి సాధ్యం కాకపోతే టేబుల్ లో టాప్ లో ఉన్న కేకేఆర్ జట్టు ఫైనల్ కు చేరుతుంది.

సూపర్ ఓవర్ టి అయితే..?

ఐపీఎల్ ప్లే ఆప్స్ మ్యాచ్ లలో ఇరుజట్లు కూడా టై అయితే సూపర్ ఓవర్ ఆడిస్తారు. అయితే సూపర్ ఓవర్ కూడా టై అయితే ఏం చేస్తారు. ఆ సమయంలో ఫలితం తేలే వరకు సూపర్ ఓవర్స్ నిర్వహిస్తారు. అప్పటికీ ఫలితం లేకపోతే పాయింట్స్ టేబుల్ లో టాప్ లో ఉన్న టీం ను విజేత గానే ప్రకటిస్తారు.

క్లిక్ చేసి ఇవి కూడా చదవండి

Gpay : గూగుల్ పే వినియోగదారులకు షాక్.. ఆ సేవలు ఇక బంద్.. ఎప్పటినుంచో తెలుసుకుందాం..!

KTR : కేటీఆర్ ట్విట్టర్ లో కాంగ్రెస్ భరోసా కార్డు.. ఎందుకు పోస్ట్ చేశాడబ్బా.. తెలుసుకుందాం..!

Whatsapp : వాట్సాప్ లో డిలీట్ ఫర్ ఆల్ కు.. బదులు డిలీట్ ఫర్ మీ నొక్కారా.. అయినా రీస్టోర్ చేసుకోవచ్చు..!

డిగ్రీ చేసి ఖాళీగా ఉన్నారా..? అయితే ఈ జాబ్ ఛాన్స్.. మిస్ కాకండి..!

SRH : ఎస్ ఆర్ హెచ్ కు బిగ్ షాక్.. ఇండియా వదిలి వెళ్లిపోయిన కామిన్స్, హెడ్..!