Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking NewsTOP STORIESతెలంగాణరాజకీయం

KTR : కేటీఆర్ ట్విట్టర్ లో కాంగ్రెస్ భరోసా కార్డు.. ఎందుకు పోస్ట్ చేశాడబ్బా.. తెలుసుకుందాం..!

KTR : కేటీఆర్ ట్విట్టర్ లో కాంగ్రెస్ భరోసా కార్డు.. ఎందుకు పోస్ట్ చేశాడబ్బా.. తెలుసుకుందాం..!

మన సాక్షి, వెబ్ డెస్క్:

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ ట్విట్టర్ లో కాంగ్రెస్ భరోసా కార్డును పోస్ట్ చేశారు. ఇది హాట్ టాపిక్ అయినప్పటికీ ఆయన ట్విట్టర్ లో ఏం రాశాడో తెలుసుకుందాం.. కాంగ్రెస్ ఎన్నికల సమయంలో భరోసా కార్డులో ఇచ్చిన హామీని అమలు చేయడం లేదంటూ ట్విట్టర్ లో రాసుకొచ్చిన కేటీఆర్.. కార్డును కూడా పోస్ట్ చేశారు.

ALSO READ : Whatsapp : వాట్సాప్ లో డిలీట్ ఫర్ ఆల్ కు.. బదులు డిలీట్ ఫర్ మీ నొక్కారా.. అయినా రీస్టోర్ చేసుకోవచ్చు..!

ఆయన ట్విట్టర్ లో ఏం రాశారంటే..

ఇది కపట కాంగ్రెస్ మార్కు మోసం.. దగా.. నయవంచన..

గ్యారెంటీ కార్డులో..
“వరిపంటకు” రూ.500 బోనస్ అని ప్రకటించి..
ఇప్పుడు “సన్న వడ్లకు మాత్రమే” అని
సన్నాయి నొక్కులు నొక్కుతారా ??

ప్రచారంలో ప్రతి గింజకు అని ఊదరగొట్టి..
ప్రభుత్వంలోకి రాగానే చేతులెత్తేస్తారా ??

ఇది ప్రజా పాలన కాదు..
రైతు వ్యతిరేక పాలన

నిన్నటిదాకా సాగునీరు ఇవ్వక సావగొట్టారు..
కరెంట్ కోతలతో పంటలను ఎండగొట్టారు..
కష్టించి పండించిన ధాన్యాన్ని కొనకుండా
అకాల వర్షాలపాలు చేసి ఆగం చేశారు..

ప్రతి ఏటా రైతులు, కౌలు రైతులకు
రూ.15 వేలు రైతుభరోసా అన్నారు .. ఇవ్వలేదు

వ్యవసాయ కూలీలకు
రూ.12000 వేలు అన్నారు.. వేయలేదు

ప్రతి రైతుకు డిసెంబర్ 9నే..
రెండు లక్షల రుణమాఫీ అన్నారు.. చేయలేదు

నేడు బోనస్ విషయంలో కూడా
ప్రభుత్వ బోగస్ విధానాన్ని బయటపెట్టారు.

ఓట్ల నాడు ఒకమాట…
నాట్ల నాడు మరోమాట చెప్పడమే కాంగ్రెస్ నైజం

అసెంబ్లీ ఎన్నికల్లో గాలిమాటలతో
గారడీ చేసింది.. కాంగ్రెస్ పార్టీ

పార్లమెంట్ ఎన్నికల్లో ఓట్లు డబ్బాలో పడగానే..
నాలుగు కోట్ల ప్రజల సాక్షిగా తన నిజస్వరూపాన్ని
బయటపెట్టింది.. కాంగ్రెస్ సర్కారు

ఎద్దేడ్సిన యవుసం..
రైతేడ్చిన రాజ్యం నిలబడదు..

నమ్మి ఓటేసినందుకు.. రైతుల గొంతు కోసిన
కాంగ్రెస్ సర్కారును అన్నదాతలు ఇక వదిలిపెట్టరు..

పల్లె పల్లెనా ప్రశ్నిస్తారు..
తెలంగాణ వ్యాప్తంగా నిలదీస్తారు..
కపట కాంగ్రెస్ పై సమరశంఖం పూరిస్తారు..

నేటి నుంచి రైతన్నల చేతిలోనే..
కాంగ్రెస్ సర్కారుకు కౌంట్ డౌన్ షురూ..

జై కిసాన్
జై తెలంగాణ

 

 

మరిన్ని వార్తలు