Whatsapp : వాట్సాప్ లో డిలీట్ ఫర్ ఆల్ కు.. బదులు డిలీట్ ఫర్ మీ నొక్కారా.. అయినా రీస్టోర్ చేసుకోవచ్చు..!

సోషల్ మీడియా మేనేజింగ్ యాప్స్ లో అతి ఎక్కువ మంది యూజర్లు ఉపయోగించుకునే యాప్.. వాట్సాప్ యూజర్ల సంఖ్య రోజుకు పెరుగుతుంది. దాంతో వాట్సాప్ ఉన్న క్రేజ్ మరింతగా పెరుగుతుంది. అందుకు కారణం కొత్త కొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకురావడమే అని చెప్పవచ్చును.

Whatsapp : వాట్సాప్ లో డిలీట్ ఫర్ ఆల్ కు.. బదులు డిలీట్ ఫర్ మీ నొక్కారా.. అయినా రీస్టోర్ చేసుకోవచ్చు..!

మన సాక్షి , వెబ్ డెస్క్ :

సోషల్ మీడియా మేసేజింగ్ యాప్స్ లో అతి ఎక్కువ మంది యూజర్లు ఉపయోగించుకునే యాప్.. వాట్సాప్ యూజర్ల సంఖ్య రోజుకు పెరుగుతుంది. దాంతో వాట్సాప్ ఉన్న క్రేజ్ మరింతగా పెరుగుతుంది.

అందుకు కారణం కొత్త కొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకురావడమే అని చెప్పవచ్చును. వాట్సాప్ యూజర్లకు ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను పరిచయం చేస్తూ వస్తుంది. ఆ క్రమంలోనే తాజాగా మరో కొత్త ఫీచర్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. యూజర్ల అవసరాలకు అనుగుణంగా ఈ కొత్త ఫీచర్ ను తీసుకొచ్చింది.

ఈ వాట్సాప్ లో ఇంట్రెస్టింగ్ ఫీచర్స్ లో ఇది చాలామందికి ఉపయోగపడే విధంగా ఉంది. ఎవరికైనా మనం ఫోటో గాని, మెసేజ్ గాని పంపిన తర్వాత దానిని మళ్లీ అవతలి వ్యక్తి చూడకుండా ఉండేందుకుగాను డిలీట్ ఫర్ ఆల్ అనే ఫీచర్ ఒకటి ఉండడంతో దానిని మనం డిలీట్ చేస్తున్నాము. కానీ దానిని పొరపాటుగా డిలీట్ ఫర్ ఆల్ అని నొక్కకుండా.. డిలీట్ ఫర్ మీ అని నొక్కితే కేవలం మన వాట్సాప్ లో మాత్రమే డిలీట్ అవుతుంది. అవతలి వ్యక్తికి మెసేజ్ ఉంటుంది.

అలాంటి సందర్భంలో మర్చిపోయి డిలీట్ ఫర్ ఆల్ కు బదులు డిలీట్ ఫర్ మీ నొక్కుతుంటాం.. అయితే ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు వాట్స్అప్ కొత్త ఫీచర్ ను తీసుకొచ్చింది. వాట్సాప్ త్వరలోనే “అన్ డు డిలీట్ ఫర్ మీ” అనే కొత్త ఫీచర్ ను తీసుకొస్తుంది. ఈ కొత్త ఫీచర్ సహాయంతో డిలీట్ ఫర్ మీ చేసిన మెసేజ్ ని అన్న డూ చేసుకునే అవకాశం కల్పించనున్నారు.

ప్రస్తుతం ఈ ఫీచర్ టెస్టింగ్ దశలో ఉంది. త్వరలో ఈ ఫీచర్ ను అందుబాటులోకి తీసుకురానున్నారు. ఈ ఫీచర్ ఎలా పనిచేస్తుందంటే మీరు డిలీట్ ఫర్ మీ క్లిక్ చేయగానే అన్న డూ డిలీట్ ఫర్ మీ ఆప్షన్ కనిపిస్తుంది. ఆ ఆప్షన్ క్లిక్ చేయగానే మీరు డిలీట్ చేసిన మెసేజ్ మళ్లీ రీస్టోర్ అవుతుంది. దీంతో మళ్లీ డిలీట్ ఫర్ ఆల్ నొక్కితే సరిపోతుంది.

అయితే ఈ అన్న డూ ఆప్షన్ కేవలం 5 సెకండ్లు మాత్రమే ఉండే అవకాశం ఉంది. ఆలోపే మనం డిలీట్ చేయాలనుకున్న మెసేజ్ ని డిలీట్ ఫర్ ఆల్ క్లిక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది చాలామందికి ఉపయోగకరంగా ఉండే ఆప్షన్ అని చెప్పవచ్చును.

మరిన్ని వార్తలు చదవండి : 

Prabhas : ప్రభాస్ కు పెళ్లి వేళయ్యిందా.. చేసుకోబోయేది ఆ హీరోయిన్నేనా..?

Telangana : రేవంత్ రెడ్డి రాజీనామా.. ఆయన స్థానంలో మరో వ్యక్తి నియామకం..!

SRH : ఎస్ ఆర్ హెచ్ కు బిగ్ షాక్.. ఇండియా వదిలి వెళ్లిపోయిన కామిన్స్, హెడ్..!

డిగ్రీ చేసి ఖాళీగా ఉన్నారా..? అయితే ఈ జాబ్ ఛాన్స్.. మిస్ కాకండి..!