Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణరాజకీయంహైదరాబాద్

Telangana : రేవంత్ రెడ్డి రాజీనామా.. ఆయన స్థానంలో మరో వ్యక్తి నియామకం..!

Telangana : రేవంత్ రెడ్డి రాజీనామా.. ఆయన స్థానంలో మరో వ్యక్తి నియామకం..!

హైదరాబాద్, మన సాక్షి :

రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవితో పాటు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా కూడా కొనసాగుతున్నారు. హై కమాండ్ నిర్ణయం మేరకు ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష పదవికి రాజీనామా చేయనున్నారు.

తెలంగాణలో లోకసభ ఎన్నికలు ముగిసిన తర్వాత ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కొత్త అధ్యక్షుడు నియమాకం ఉంటుందని కాంగ్రెస్ హై కమాండ్ ప్రకటించింది. ఈ నేపథ్యంలో లోకసభ ఎన్నికల ఫలితాల అనంతరం రేవంత్ రెడ్డి ఆ పదవికి రాజీనామా చేయబోతున్నారు. హై కమాండ్ నిర్ణయంతో పిసిసి కొత్త అధ్యక్షుని నియమించే అవకాశాలు ఉన్నాయి.

పిసిసి అధ్యక్ష పదవికి పోటాపోటీ :

ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష పదవికి పోటాపోటీ కొనసాగుతుంది. ముఖ్యమంత్రిగా పిసిసి అధ్యక్షుడిగా ఉన్న రేవంత్ రెడ్డి పార్టీ నిర్ణయం మేరకు పిసిసి అధ్యక్ష పదవికి రాజీనామా చేయనున్నారు. ఈ నేపథ్యంలో పీసీసీ అధ్యక్ష పదవికి పలువురు నేతలు పోటీలో ఉన్నట్లు సమాచారం.

పిసిసి అధ్యక్ష పదవికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పేరు వినిపిస్తుంది. ప్రస్తుతం ఆయన సోదరుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రి పదవిలో ఉన్నారు. కాగా ఆయన కూడా మంత్రి పదవి కావాలని హైకమాండ్ వద్ద ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. కాగా మంత్రి పదవి రాకుంటే పిసిసి అధ్యక్ష పదవి అయినా అడిగే అవకాశం ఉంది. కానీ పిసిసి అధ్యక్ష పదవి ముఖ్యమంత్రి పదవి కూడా ఒకే సామాజిక వర్గానికి చెందిన వారిని నియమిస్తారా..? లేదా.? అనేది వేచి చూడాల్సి ఉంది.

అదేవిధంగా సీతక్క, బట్టి విక్రమార్క, మధు యాష్కి తో పాటు మరి కొంతమంది నాయకులు కూడా పిసిసి పదవికి పోటీ పడుతున్నట్లు సమాచారం. రేవంత్ రెడ్డి ఎవరి పేరు ప్రతిపాదిస్తే వారికే పిసిసి అధ్యక్ష పదవి వస్తుందని కూడా పలువురు నేతలు పేర్కొంటున్నారు. ఏది ఏమైనా మరి కొద్ది రోజుల్లో పిసిసి నూతన అధ్యక్షుడిని నియమించబోతున్నారు.

MOST READ : 

IPL 2024 – RCB ప్లే ఆప్స్ కు వెళ్తుందా.. వెళ్లాలంటే ఏం చేయాలి, అభిమానుల్లో ఉత్కంఠ..!

డిగ్రీ చేసి ఖాళీగా ఉన్నారా..? అయితే ఈ జాబ్ ఛాన్స్.. మిస్ కాకండి..!

SRH : ఎస్ ఆర్ హెచ్ కు బిగ్ షాక్.. ఇండియా వదిలి వెళ్లిపోయిన కామిన్స్, హెడ్..!

Work From Home : వర్క్ ఫ్రం హోం ఉద్యోగం కావాలా..? లక్షల జీతం.. ఇలా పొందండి..!

మరిన్ని వార్తలు