Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking NewsTOP STORIESజాతీయంటెక్నాలజీ

Gpay : గూగుల్ పే వినియోగదారులకు షాక్.. ఆ సేవలు ఇక బంద్.. ఎప్పటినుంచో తెలుసుకుందాం..!

Gpay : గూగుల్ పే వినియోగదారులకు షాక్.. ఆ సేవలు ఇక బంద్.. ఎప్పటినుంచో తెలుసుకుందాం..!

మన సాక్షి, వెబ్ డెస్క్:

డిజిటల్ పేమెంట్ వ్యవస్థ దేశవ్యాప్తంగా రోజురోజుకు భారీగా పెరుగుతుంది. డిజిటల్ చెల్లింపు విధానం తోటే ఎక్కువగా డబ్బు మారకం జరుగుతుంది. చిన్న చిన్న అవసరానికి కూడా డిజిటల్ పేమెంట్స్ ని వాడుతున్నారు. వాటిలో ఎక్కువగా గూగుల్ పే ఫోన్ పే ఉపయోగిస్తున్నారు.

గూగుల్ పే, ఫోన్ పే వాడే వారి సంఖ్య రోజుకు విపరీతంగా పెరుగుతుంది. మొదట్లో స్క్రాచ్ కార్డులు, గిఫ్టులు వచ్చే విధంగా ఫోన్ పే, గూగుల్ పే అందరిని ఆకట్టుకుంది. ప్రస్తుతం స్క్రాచ్ కార్డులతో క్యాష్ బ్యాక్, ఓచర్స్ లాంటివి కూడా గూగుల్ పే లో వస్తున్నాయి. దాంతో చాలామంది గూగుల్ పే వినియోగిస్తున్నారు. కానీ గూగుల్ పే వినియోగదారులకు ఓ పెద్ద షాక్ తగలనున్నది.

జూన్ మాసంలో గూగుల్ పేను మూసివేయబోతున్నట్లు ఆ సంస్థ స్వయంగానే తెలియజేసింది. జూన్ 4వ తేదీ నుంచి దానిని మూసివేయబోతున్నారు. అది ఏ ఏ దేశాలలో మూసివేయబోతున్నారో తెలుసుకుందాం..

గూగుల్ పే యాప్ భారత్, సింగపూర్ లో మాత్రమే పని చేయనున్నది. అమెరికాలో దీని సేవలు నిలిపివేయబోతున్నట్లు గూగుల్ సంస్థ తెలిపింది. కంపెనీ ప్రకారం వినియోగదారులంతా గూగుల్ వాలెట్ కు బదిలీ చేయబడతారు. గూగుల్ పే నిలిచిపోనున్నది. గూగుల్ వాలెట్ ను ప్రమోట్ చేసేందుకు గాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. సుమారుగా 180 దేశాలలో Gpay కి బదులుగా Google Wallet ని భర్తీ చేస్తున్నట్లు ఆ సంస్థ పేర్కొంటున్నది.

ఇవి కూడా క్లిక్ చేసి చదవండి : 

Prabhas : ప్రభాస్ కు పెళ్లి వేళయ్యిందా.. చేసుకోబోయేది ఆ హీరోయిన్నేనా..?

Whatsapp : వాట్సాప్ లో డిలీట్ ఫర్ ఆల్ కు.. బదులు డిలీట్ ఫర్ మీ నొక్కారా.. అయినా రీస్టోర్ చేసుకోవచ్చు..!

డిగ్రీ చేసి ఖాళీగా ఉన్నారా..? అయితే ఈ జాబ్ ఛాన్స్.. మిస్ కాకండి..!

WhatsApp : వాట్సాప్ లో రెండు కొత్త ఫీచర్లు.. ఎలా ఉపయోగించాలో తెలుసుకోండి..!

మరిన్ని వార్తలు